Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ మాట మార్చేది లేదు , మడమ తిప్పేది లేదు “…అనేది వైసీపీ అధినేత జగన్ ట్రేడ్ మార్క్ డైలాగ్. కానీ డైలాగ్ చెప్పినంత తేలిక కాదు దాన్ని పాటించడం. ఈ విషయం మరోసారి రుజువైంది. అంతేకాదు… మీడియా దిగ్గజం రామోజీ తన వలలో పడలేదని కూడా జగన్ కి అర్ధం అయ్యింది. అందుకే ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఇప్పటిదాకా రామోజీ మీద వేసుకున్న వినయపు ముసుగు తొలగించుకున్నారు. ఈ మ్యాటర్ డీటెయిల్స్ ఏమిటంటే…
2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ అండ్ టీం ఆత్మశోధన చేసుకుంది. అందులో భాగంగా మీడియా మద్దతు లేకపోవడం కూడా తమ ఓటమికి ఒక కారణం అని తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే మీడియా తో వైరం పనికిరాదని నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టు ఒకటి రెండు కాదు పది అడుగులు కిందకి దిగి ఒకప్పుడు గురివింద అని విమర్శలు చేసిన రామోజీ వద్దకు స్వయంగా వెళ్లారు జగన్ . ఆయన ఆశీర్వచనాలు కోరారు. రామోజీ అల్ ది బెస్ట్ అయితే చెప్పారు కానీ జగన్ అండ్ కో సాక్షిని అడ్డం పెట్టుకుని చేసిన విన్యాసాలు మర్చిపోలేదు. అందుకే మీడియా పరంగా జగన్ , వైసీపీ తో ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరించారు.వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని జగన్ అండ్ కో కూడా గ్రహించింది. అందుకేనెమో తాజాగా జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతి తో ఈనాడుని కూడా కలిపేశారు. ఆ పత్రికలతో పాటు యెల్లో చానెల్స్ చూడొద్దని పిలుపు ఇచ్చారు. అంత పిలుపు ఇచ్చే పౌరుషం వున్నవాళ్లు రామోజీ ఇంటికెళ్లినప్పుడు దాన్ని ఎక్కడ దాచిపెట్టుకున్నారో పాపం!.