బావ అనిల్, తమ్ముడు అనిల్ మధ్యలో జగన్.

jagan-in-confusion-between-his-brother-and-brother-in-law-anil
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగులో ఓ నానుడి వుంది. “బావ బతక కోరతాడు తమ్ముడు చావు కోరతాడు “ అని. ఇందులో నిజం లేదని, ఏ బంధం అయినా ఆ ఇద్దరి మధ్య వుండే కనెక్టివిటీ మీద ఆధార పడి ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు నిరూపితం అయ్యింది. డబ్బు దగ్గర, అధికారం దగ్గర బంధుత్వం వెనక్కి వెళ్ళిపోతుందని నాటి మహాభారతం దగ్గర నుంచి నేటి అభినవ భారతం దాకా ఎన్నో కధలు, ఇంకొన్నో సజీవ సాక్ష్యాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే వైసీపీ అధినేత జగన్ కి పాపం ఇలాంటి సమస్యే వచ్చిపడింది. బావ అనిల్ కుమార్ ని ఎంచుకోవాలా లేక తమ్ముడు అనిల్ రెడ్డి ని నమ్ముకోవాలా అన్న విషయంలో ఆయన అయోమయంలో ఉన్నారట.

వై.ఎస్ అధికారంలో వున్న రోజుల నుంచి జగన్ బావ అనిల్ కుమార్ పేరు ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే వుంది. ఇక జగన్ వైసీపీ పెట్టిన తొలినాళ్లలో ఆయనదే హవా. విజయమ్మ,షర్మిల బైబిల్ పట్టుకుని బహిరంగ సభల్లో పాల్గోవడం ఆయన సలహానే అని చెప్పుకుంటారు. అది రివర్స్ అయ్యి 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయాక అనిల్ కుమార్ దూకుడు బయటకు కాస్త తగ్గింది. అయితే తెర వెనుక మాత్రం అనిల్ అలానే ఉన్నారట. బావమరిది జగన్ ని సీఎం పీఠం ఎక్కించడానికి ఆయన వంతు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

ఇటీవల రామ్ గోపాల్ వర్మ “ లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా ప్రకటించినప్పుడు హోటల్ హయత్ లో ఆయనతో అనిల్ కుమార్ భేటీ అప్పట్లో సంచలనం. అయితే ఆ సినిమా మూలన పడడమే కాదు. ఆ సినిమాకు ఆయువుపట్టు అనుకున్న వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సైతం రామ్ గోపాల్ వర్మని తిట్టి బాలయ్య తీసే ఎన్టీఆర్ బయోపిక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇక తాజాగా అమరావతికి నిధులు ఇవ్వొద్దని కెనడా కి చెందిన ఓ ngo చేత అనిల్ కుమార్ లేఖ రాయించినట్టు తెలుస్తోంది. ఆ విషయం కూడా బయటకు వచ్చి నానా రచ్చ అవుతోంది. ఇలా అనిల్ కుమార్ టేక్ అప్ చేసిన విషయాల్ని స్మూత్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. జగన్ కి ఉపయోగపడేలా ఫినిషింగ్ ఇవ్వలేకపోతున్నారు.

ఇక వై.ఎస్ కుటుంబంలో సౌమ్యుడుగా పడ్డ అనిల్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. జగన్ అన్న ని ఎలాగైనా సీఎం చేయాలని అనుక్షణం తపనపడే ఈయనకి వ్యవహారాలు సమర్ధంగా నడిపే సత్తా ఉందట. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా, బయటకు హడావిడి చేయకుండా పని కానించే సత్తా వున్న అనిల్ రెడ్డి ని బావ అనిల్ కుమార్ కన్నా ఎక్కువగా పార్టీ ,ఇతర వ్యవహారాల్లో ఇన్ వాల్వ్ చేస్తే బెటర్ అని ఆ ఇద్దరు గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. వైసీపీ శ్రేణుల్లోనూ ఇదే అభిప్రాయం ఉందట. అయితే అనిల్ కుమార్ ని పక్కనబెడితే షర్మిల ఎక్కడ హర్ట్ అవుతుందో అని జగన్ భయమట. దీంతో ఇద్దరు అనిల్స్ మధ్య జగన్ నలిగిపోతున్నారు పాపం.