Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్షణానికో రకంగా మారిపోయే రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే సొంత బలంతో పాటు ప్రత్యర్థుల బలాలు, బలహీనతల మీద కూడా అవగాహన ఉండాలి. 2014 లో ఇదే పాయింట్ మిస్ అయ్యి సొంత బలాన్ని అతిగా ఊహించుకున్న వైసీపీ అధినేత జగన్ గెలుపు ముంగిట బొక్కబోర్లా పడ్డాడు. 2019 లో ఏ ఛాన్స్ మిస్ చేసుకోకూడదన్న ఆలోచనలో వున్నాడు. అయితే ఈసారి జగన్ ఫోకస్, పెట్టుబడి అంతా టీడీపీ యువ నాయకుడు లోకేష్ మీదేనంట. వినడానికి ఆశ్చర్యంగా వున్నా జగన్ ఆపరేషన్స్ ని దగ్గరుండి చూసిన ఓ వ్యక్తి చెప్పిన వివరాలు ఆశ్చర్యం అనిపిస్తున్నాయి.
2014 లో సొంత బలం అనే పాయింట్ వర్కౌట్ కాకపోవడంతో ఈసారి జగన్ ప్రత్యర్థి లోకేష్ బలహీనత మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తాను ఎంత కష్టపడ్డా జనం లో మైలేజ్ రాకపోవడానికి అవినీతి ముద్ర ప్రధాన కారణమని జగన్ కి అర్ధం అయ్యిందట. తన మీద పడ్డ అవినీతి మరక పోదు కాబట్టి తనతో సమానంగా లోకేష్ అవినీతిపరుడని ప్రపంచానికి చాటాలని జగన్ డిసైడ్ అయ్యారు. దీంతో ఫినిష్ లోకేష్ అనే పేరుతో సాక్షి సహా వివిధ వెబ్ సైట్స్ లో పని చేస్తున్న విలేకరులతో ఓ టీం ని ఏర్పాటు చేశారట జగన్. వీరి పని ఒక్కటే… అనుక్షణం లోకేష్ మూమెంట్స్ గమనిస్తూ ఆయన చేసే ప్రతి పని మీద ఆరా తీయడం, అందులో తప్పుల్ని బయటకు చెప్పడం. ఇక లోకేష్ మాటల్లో దొర్లాడే తప్పుల్ని పట్టుకుని సోషల్ మీడియాలో హైలైట్ చేయడం కూడా ఈ టీం పనే అట. ఈ టీం కోసం జగన్ పెడుతున్న ఖర్చు అక్షరాలా నెలకి 50 లక్షల పైమాటే అని తెలుస్తోంది.
విలేకరుల ముసుగులో వేగులుగా పనిచేస్తున్న ఈ బృందంలో దాదాపు 30 మంది పని చేస్తున్నారట. అయితే ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ఈ ఆపరేషన్ ఇప్పటిదాకా ఏ గొప్ప విషయాన్ని బయటపెట్టలేకపోవడంతో జగన్ తీవ్ర అసంతృప్తి తో ఉన్నట్టు సమాచారం. ఇటీవల ఫినిష్ లోకేష్ టీం సభ్యులతో భేటీ సందర్భంగా రాబోయే కొద్ది సమయంలో ఏదో ఒక సంచలనం బయటకు తేవాలని జగన్ ఆదేశించడంతో ఆ టీం టెన్షన్ పడిపోతోంది. ఏదేమైనా సొంత బలం కన్నా ప్రత్యర్థి బలహీనత మీదే కన్నేయడం, ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తకి తనతో సమానంగా ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే జగన్ ఆత్మవిశ్వాసం దెబ్బ తిన్నట్టు అనిపించడం లేదూ!
మరిన్ని వార్తలు