విధేయులకి న్యాయం చేస్తున్న జగన్

jagan going to delhi

తాజగా జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై పోటీ చేసి గెలుపొందిన వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావించినా సామాజిక సమీకరణాల దృష్ట్యా అది సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి. కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని భావించినా, వివిధ సమీకరణాల కారణంగా పదవులు వరించని పార్టీ ఎమ్మెల్యేలకు వైఎస్ జగన్ కీలక పదవులను పంచుతున్నారు. ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తుడా – తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఖరారు చేసిన ఆయన తాజాగా మంగళగిరిలో మాజీ మంత్రి నారా లోకేశ్ ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీయే చైర్మన్ పదవిని అప్పగించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే, మంత్రి పదవిని ఇస్తానని జగన్ ప్రజల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆళ్లకు సీఆర్డీయేను అప్పగించాలని జగన్ భావించినట్టు సమాచారం.