Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ముఖ్యమంత్రి పీఠం కావాలి గానీ ఎందుకో హైదరాబాద్ నుంచి అక్కడికి రావాలంటే వైసీపీ అధినేత జగన్ కి పెద్దగా నచ్చదు. ఈ విషయం మరోసారి తేలిపోయింది. హైదరాబాద్ నుంచే ఇంకా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పదేపదే విమర్శలు వస్తున్న నేపథ్యంలో మూడేళ్ళ తర్వాత పార్టీ ఆఫీస్ తరలింపు కి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అది కూడా విజయవాడలో తాత్కాలిక కార్యాలయం. పార్టీ సీనియర్ నాయకుడు కె. పార్ధసారధి కి చెందిన స్థలంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నిర్మించారు. దీని ఓపెనింగ్ ఎంతో ఘనంగా జరుగుతుందని అనుకున్నా సాక్షాత్తు జగన్ కూడా దీని పూజ కార్యక్రమాలకి డుమ్మా కొడుతున్నారు.
విజయవాడ స్వరాజ్య మైదానం దగ్గర ఏర్పాటైన వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఓపెనింగ్ కి సంబంధించి ఈరోజు ప్రారంభ ముహూర్తం పెట్టుకున్నారు. రేపటినుంచి మంచి రోజులు కాదనడంతో ఎట్టి పరిస్థితుల్లో నేడే పూజలు చేయాలి అని డిసైడ్ అయ్యారు. అయితే ఈ పూజలకు జగన్ హాజరు కారట. పార్టీ సీనియర్ నేతలు వై.వి . సుబ్బారెడ్డి, బొత్స, పెద్దిరెడ్డి, కె. పార్ధసారధి తదితరులు మాత్రమే ఈ పూజల్లో పాలుపంచుకుంటారట. ఏదేమైనా వైసీపీ రాష్ట్ర కార్యాలయ పూజలకు జగన్ రాకపోవడం ఆ పార్టీ శ్రేణులకు నిరాశ కలిగిస్తోంది. ఇంకోసారి ప్రత్యర్థి పార్టీలకి విమర్శకి అవకాశం ఇస్తోంది. ఎందుకో జగన్ కి ఏపీ అంటే అంత చిన్న చూపు ?