Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ సలహాలతో డిఫరెంట్ గా వ్యూహాలు రచిస్తున్న జగన్.. ఇప్పుడు కూడా కీలకమైన రాజకీయ వ్యూహాలకు ఇడుపులపాయలో పదును పెడుతున్నారు. పేరుకు ప్లీనరీ గుంటూరు సమీపంలో నిర్వహిస్తున్నా.. గ్రౌండ్ వర్క్ మాత్రం అచ్చొచ్చిన ఇడుపులపాయలోనే చేస్తున్నారు. వైసీపీ సీనియర్లతో కీలక మీటింగ్ కూడా పెట్టారు.
పైగా ఈసారి ఎన్నికల్లో అధికారం కోసం ఏం చేయడానికైనా రెడీ అని జగన్ సంకేతాలిస్తున్నారు. కావాలంటే తీవ్రంగా వ్యతిరేకించే వారితో పొత్తు దగ్గర్నుంచి, అలవికాని హామీల వరకు దేనికైనా రెడీ అంటున్నారు. గత ఎన్నికల్లో రుణమాఫీకి నో అన్న జగన్.. ఇప్పుడు దానికీ రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
అదే జరిగితే అధికారం కోసం దేనికైనా దిగజారతారన్న పేరొస్తుంది. అందుకే అప్పుడు ఎందుకు వద్దు.. ఇప్పుడు ఎందుకు రుణమాఫీ కావాలనే దానిపై జగన్ క్లారిటీ ఇస్తారట. అందుకోసం వ్యూహం సిద్ధం చేయడానికే ఇడుపుల పాయలో కీలక మీటింగ్ పెట్టారు. కానీ జగన్ పద్ధతి చూస్తుంటే.. ఆయన చెప్పే విషయం జనాలకు ఎక్కుతుందా అనే డౌట్ కొడుకోంది.
మరిన్ని వార్తలు