Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్నికలకు రెండేళ్ల ముందే హామీలిచ్చి మ్యానిఫెస్టో ప్రకటించిన జగన్.. సోషల్ మీడియాలో తన హామీలకు తానే డప్పు కొట్టుకోవడం మొదలుపెట్టారు. కార్యకర్తలు ఎలాంటి నినాదాలతో జనం ముందుకు వెళ్లాలో కూడా జగనే చెబుతున్నారు. అన్న వస్తున్నాడు.. నవరత్నాలు తెస్తున్నాడు అనే నినాదంతో జనంలోకి దూసుకుపోవాలని జగన్ ట్విటర్ వేదికగా శ్రేణులకు చెప్పడం చర్చనీయాంశమైంది.
ఎన్నికల కోయిల ముందే కూస్తే జనం సరైన సమయానికి అన్నీ మర్చిపోతారని వైసీపీ కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు. అసలు ఎన్నికల సమయంలో చేసిన హడావిడి ముందుగానే చేస్తే.. అసలు టైమ్ కు చేయడానికి ఏమీ ఉండదని అంటున్నారు. ఈ విషయంలో జగన్ ను ఎవరో తప్పుదోవ పట్టించారని, ప్రశాంత్ కిషోర్ జగన్ ను ముంచేలా ఉన్నారంటున్నారు కార్యకర్తలు.
కానీ జగన్ మాత్రం చెప్పిన ప్రకారం పాదయాత్రకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే రూట్ మ్యాప్ కూడా రిలీజ్ చేస్తారట. జగన్ జోరు చూస్తుంటే అధికారంలోకి వచ్చే వరకూ విరామం లేదు.. విశ్రాంతి లేదు అని డైలాగులు చెబుతున్నట్లే ఉంది. అందుకే తన పాదయాత్రను జనంలోకి తీసుకెళ్లాలని, పనిలోపనిగా నవరత్నాల గురించి ప్రచారం చేయాలంటున్నారు జగన్.
మరిన్ని వార్తలు :