Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 లో అధికార పీఠాన్ని అందుకోడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న వైసీపీ అధినేత జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. మొత్తం 13 జిల్లాల గుండా సాగే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే కొంత కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. వివిధ సమస్యలపై ప్రజల్ని జాగృతం చేయడంతో పాటు వైసీపీ ని బలపరిచే లక్ష్యంతో తలపెట్టిన ఈ పాదయాత్ర కి సంబంధించి గుంటూరు, విజయవాడ మధ్య జరగబోతున్న ప్లీనరీ లో ఓ ప్రకటన చేసే అవకాశం ఉందట. ఈ పాదయాత్ర దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చని తెలుస్తోంది.
2004 కి ముందు వై.ఎస్, 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన పాదయాత్రల తో ఆ ఇద్దరు నాయకులు కష్ట పరిస్థితి నుంచి అధికార కుర్చీని అధిష్టించగలిగారు. చంద్రబాబు పాదయాత్ర కి పోటీగా 2014 ఎన్నికలకు ముందు షర్మిల కూడా పాదయాత్ర చేసినా జగన్ జైలు నుంచి బయటకు రావడంతో సీన్ మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో అంతా తానే అయి తిరిగిన జగన్ వైసీపీ ని మాత్రం గెలిపించుకోలేకపోయారు. అందుకే ఈసారి తానే స్వయంగా పాదయాత్ర జరపాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వార్తలు