రవితేజపై కొత్త విమర్శలు

Ravi Teja Pays Homage To His Brother Bharath

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రవితేజ తమ్ముడు భరత్‌ చనిపోయి రెండు వారాలు కావస్తుంది. అయినా కూడా సోషల్‌ మీడియాలో మరియు ఎలక్ట్రానిక్‌ మీడియాలో రవితేజపై విమర్శలు తగ్గుముఖం పట్టలేదు. తమ్ముడిపై ఎంత కోపం ఉన్నా కూడా అంత్యక్రియలకు హాజరు కావాల్సింది అంటూ అంతా కూడా రవితేజకు సలహాలు ఇస్తూనే ఉన్నారు. తనపై వస్తున్న విమర్శలకు చిరాకు ఎత్తిన రవితేజ చేసేది లేక సాక్షి దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చి ఒక వివరణ ఇచ్చాడు. తమ్ముడు అంటే తనకు కోపం లేదు, కేవలం కుటుంబ పరిస్థితుల కారణంగానే అంత్యక్రియలకు హాజరు కాలేదు అంటూ తేల్చి చెప్పాడు. అయినా కూడా వివాదం సర్దుమనడం లేదు. తాజాగా తమ్ముడు ఇంటికి వెళ్లి అక్కడ దిన కర్మలు చేయించాడు. చిత్ర పటంకు శ్రద్దాంజలి ఘటించాడు. 

తమ్ముడు దిన కర్మలు చేయించిన తర్వాత తనపై వస్తున్న విమర్శలకు ఫుల్‌ స్టాప్‌ పడే అవకాశం ఉందని రవితేజ భావించాడు. కాని ఇప్పుడు కొత్త వివాదం, కొత్త విమర్శలు మొదలయ్యాయి. తమ్ముడు అంటే ప్రేమ లేకనే సొంత ఇంట్లో కాకుండా భరత్‌ నివాసం ఉన్న అపార్ట్‌మెంట్‌లో నలుగురికి కనిపించేలా కర్మ కాండ జరిపించాడు. ఇది ఒక పబ్లిసిటీ కోసం, తనపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టడం కోసం అంటూ కొందరు రవితేజ తీరును విమర్శిస్తున్నారు. రవితేజ సరిగ్గా దిన కర్మ చేయాలనుకుంటే కుటుంబ సభ్యులందరితో కలిసి తన ఇంట్లో చేయాల్సి ఉంది. కాని భరత్‌ అపార్ట్‌మెంట్‌లో చేయించాడు అంటేనే అర్థం అవుతుంది, భరత్‌ పై రవితేజకు అభిమానం లేదు, కేవలం మీడియా కోసం ఇలా చేశాడు అని కొందరు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పాపం రవితేజను భరత్‌ వివాదం ఇప్పట్లో వదిలేలా లేదుగా..!

మరిన్ని వార్తలు