Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకరికేమో తల మునిగేదాకా కేసులు… ఇంకొరికేమో ఎంత కసరత్తు చేసినా పెరగని బలం. ఈ ఇద్దరూ ఒకరి అవసరాలు ఇంకోరు తీరిస్తే ఎలా ఉంటుంది ? చంద్రబాబు వ్యతిరేకత అనే సింగల్ పాయింట్ అజెండా తో రాజకీయాలు చేస్తున్న కొందరు ఆంధ్ర నేతలు, వ్యూహకర్తలు చేసిన ఈ ఆలోచనతో ఏపీ పాలిటిక్స్ లో పెను మార్పులు రాబోతున్న సంకేతాలు వస్తున్నాయి. ఆంధ్రాలో ఏకంగా ప్రతిపక్ష వైసీపీ జెండా పీకేసి కాషాయ రెపరెపలు మధ్య జగన్ ని నడిపించడానికి బీజేపీ భారీ స్కెచ్ ప్రిపేర్ చేసినట్టు సమాచారం.
పీకల్లోతు కేసుల నుంచి బయటపడడానికి ఏ గడ్డి పోచ దొరికినా చాలనే స్థితిలో వున్న వైసీపీ అధినేత జగన్ కి ఢిల్లీ బీజేపీ రాజకీయాల్లో తెర వెనుక పాత్ర పోషిస్తున్న ఓ అమలాపురం మేధావి తోడయ్యాడు. వార్డ్ మెంబెర్ గా గెలవలేకపోయినా ఈయనకు ఢిల్లీ లెవెల్ లో వున్న పేరు గొప్పదే. ఈ ఇద్దరికీ మధ్య కాంగ్రెస్ నుంచి బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కొందరు నేతలు వారధి ఏర్పరిచారు. ఇంకేముంది ఆయన ముందు భోరుమన్న జగన్ “తనని కేసుల నుంచి బయటపడేస్తే 2019 ఎన్నికల్లో పొత్తుకు రెడీ అన్నారు. 25 దాకా అసెంబ్లీ స్థానాలు, 12 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కి ఇవ్వడానికి సిద్ధం”. అని చెప్పాడు. సూపర్ ఆఫర్ ఇచ్చా కాబట్టి ఇక బీజేపీ నుంచి నో అన్న మాట రాదని ఊహించిన జగన్ కి పెద్ద షాక్ తగిలింది. అటు నుంచి జగన్ దిమ్మతిరిగే జవాబు వచ్చిందట. “భేషరతుగా బీజేపీ లో వైసీపీ ని విలీనం చేస్తే కేసుల నుంచి బయటపడేసే విషయం ఆలోచిస్తాం. 2019 ఎన్నికల్లో గెలిస్తే సీఎం పోస్ట్ తప్పనిసరిగా ఇస్తామని చెప్పలేము”. అన్న మాటతో జగన్ కి మైండ్ బ్లాక్ అయ్యిందట.
అయితే కేసులు, జైలు గుర్తుకు వచ్చిన జగన్ వెంటనే తేరుకుని “ప్లీజ్ ఇప్పుడు విలీనం అనొద్దు. 2019 ఎన్నికల్లో గెలిచాక మీరు ఏమి చెబితే అదే చేస్తా. అప్పటిదాకా వైసీపీ జెండా ఉండనివ్వండి ” అని బతిమాలినా అటు నుంచి పెద్దగా రియాక్షన్ లేదట. టీడీపీ లాంటి పార్టీని వదులుకొని రావాలంటే వైసీపీ విలీనం కావాల్సిందే అని బీజేపీ పెద్దలు తేల్చి చెప్పడంతో జగన్ తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు. ఇందాకా వచ్చాక ఇప్పుడు జగన్ ముందు వున్నది రెండే అషన్స్. ఒకటి కేసులు, జైలు ఎదుర్కోవడం లేదా వైసీపీ జెండా పీకేసి బీజేపీ పంచన చేరడం. ఏదేమైనా టైం చూసి వైసీపీ జెండా పీకేయడానికి బీజేపీ భలే స్కెచ్ వేసింది. ఆ స్కెచ్ నుంచి తప్పించుకోవడం జగన్ వల్లవుతుందా ?
చంద్రబాబుని బుక్ చేద్దామని బీజేపీ దగ్గరికి వెళ్లినందుకు ఇలా జెండా పీకేసే పరిస్థితి వస్తుందని అనుకోలేదని జగన్ తన సన్నిహితులతో వాపోతున్నాడంట. ఔను మరి రాజకీయ తిమింగలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆలోచించకుండా ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ?
మరిన్ని వార్తలు