Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి ఫాన్స్ కి కాస్త కిక్ ఇచ్చే వార్త ఇది. పైసా వసూల్, జైలవకుశ తమ అభిమాన హీరోల సినిమాలు బిజినెస్ లో దూసుకెళ్లడమే ఇందుకు కారణం. భవ్య క్రియేషన్స్ పతాకం మీద వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా చేస్తున్న పైసా వసూల్ ని బాలయ్య మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని 40 కోట్లతో పూర్తి చేయాలని చూసారు. అయితే ఫారిన్ షెడ్యూల్స్ తో అనుకున్న దాని కంటే ఖర్చు కాస్త ఎక్కువే అయ్యిందట. 40 అనుకున్నది కాస్త 47 ని టచ్ చేసిందట. అయినా నిర్మాత సేఫ్ పొజిషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సాటిలైట్ రైట్స్ ద్వారా దాదాపు 8 కోట్లు ఇప్పటికే రాగా, ఇక థియేట్రికల్ రైట్స్ పరంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 నుంచి 50 కోట్లకి అమ్మే అవకాశం ఉందట. ఆ విధంగా చూసుకుంటే నిర్మాతకి రిలీజ్ కి ముందే పైసా వసూల్ అయినట్టే. బాలయ్య
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న జైలవకుశ సైతం భారీ రేట్లకి అమ్ముడు అయ్యింది.కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తో 70 కోట్లు రాబట్టాడు ఎన్టీఆర్. కేవలం ఒకే ఒక్క రోజులో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఎగరేసుకెళ్లారు డిస్ట్రిబ్యూటర్స్. హాట్ కేక్ లా అమ్ముడుపోయిన ఈ సినిమాకి సంబంధించి జరిపిన కొనుగోళ్ల మీద జీఎస్టీ కూడా కట్టేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం ట్రేడ్ లో గొప్పగా చెప్పుకుంటున్నారు. నైజాం లో దిల్ రాజు జైలవకుశ పంపిణీ చేస్తున్నారు. నైజాం లో జైలవకుశ 20 కోట్లు పలగ్గా, సీడెడ్ లో 13 .5 కోట్లు, ఆంధ్రాలో 36 కోట్లు పలికింది. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద సినిమాకి ఇంత రేట్లు పలకడం, ఇంత స్పీడ్ గా బిజినెస్ జరగడం ఇదే కావడం విశేషం.
మరిన్ని వార్తలు