జనసేన కవాతు తాజాగా కొన్ని జ్ఞాన గుళికలను ప్రజల్లోకి వదిలింది. ఒకటి సీఎం ఎలా కావాలి? ఇంకోటి కారులో కవాతు ఎలా చేయాలి? ఇవి ఇపుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. చంద్రబాబు 21 లక్షల ఓట్లు తొలగిస్తే అందులో 19 లక్షలు జనసేనవి అని పవన్ కల్యాణ్ ఈరోజు ప్రకటించారు. అసలు ఓటర్ల లిస్టు ఎప్పుడు సవరిస్తారు? ఎవరు సవరిస్తారు? అనే కనీస సమాచారం కూడా లేకుండా ఏకంగా సీఎం పీఠాన్ని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఏ ఎన్నికలు వచ్చినా ఓటర్ల సవరణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఆ టైంలో జాబితా సవరణ జరుగుతుంది.
ఇపుడు ఏపీలో ఏ ఎన్నికలు ఉన్నాయని సవరణ జరిగింది. అదేమైనా రాష్ట్ర శాఖనా ఎపుడు పడితే అపుడు చంద్రబాబు చేయడానికి చేయించడానికి, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది కేంద్రం ఆధీనంలో కూడా ఉండదు. అయితే, కేంద్ర సంస్థలను ఇప్పటికే అడ్డంగా వాడేస్తున్న బీజేపీ ప్రభుత్వం బాబు మీద పవన్ తో నిందేయించి తన పని తాను చేసుకుపోయే కొత్త గేమ్‌కు శ్రీకారం చుట్టినట్లున్నాయి పవన్ వ్యాఖ్యలు. నిన్న కవాతు అనంతరం ప్రసంగిస్తున్న నన్ను సీఎం అనండి సీఎం అనండి అంటూ సిగ్గులేకుండా అడిగి మరీ అనిపించుకుని తన కోరిక తీర్చుకున్న పవన్ కళ్యాణ్. అరిస్తే మాత్రమే సీఎం అయిపోను. మీరందరూ ఓట్లు నమోదు చేసుకుని ఓటు వేస్తే నేను గెలుస్తాను, ముఖ్యమంత్రి అవుతాను అని అభిమానులకి చెప్పుకున్నారు.