Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఇతరులు ఎంతగా విమర్శలు చేసినా కూడా ఆయన శిష్యులు మాత్రం ఆయన్ను దేవుడిగా భావిస్తారు. ఇండస్ట్రీలో ప్రస్తుతం వర్మ శిష్యులు ఎంతో మంది ఉన్నారు. ఆయన వద్ద కనీసం ఒక్క సినిమాకు అయినా శిష్యుడిగా చేయాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. వర్మ శిష్యుడిని అని చెప్పుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతారు. వర్మ వర్కింగ్ స్టైల్‌ను నేర్చుకునేందుకు ఆయన వద్ద ఎంతో మంది అసిస్టెంట్స్‌గా చేశారు, చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా వర్మపై ఒక అసిస్టెంట్ చేస్తున్న ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు సినీ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వర్మ తాజాగా తెరకెక్కించిన పోర్న్ చిత్రం ‘జీఎస్టీ’ స్క్రిప్ట్ తనది అంటూ జయకుమార్ మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
జయకుమార్ తన ఆఫీస్‌లో ఎన్నో సార్లు దొంగతనం చేసి పట్టుబడ్డాడు అంటూ రామ్ గోపాల్ వర్మ రివర్స్ ఎటాక్ చేయడంతో జయకుమార్ మరింతగా రెచ్చిపోయాడు. వర్మ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టిన్ వంటి వాడు అంటూ ఆరోపించాడు. ఎంతో మంది యువ రచయితలు మరియు యువ దర్శకుల పాలిట శాపంగా వర్మ మారాడు అంటూ జయకుమార్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇదే సమయంలో వర్మ ఒక స్వలింగ సంపర్కుడు అంటూ కూడా జయకుమార్ ఆరోపణ చేశాడు. వర్మలో మరో మనిషి ఉన్నాడని, ఆ మనిషి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసని, ఆ మనిషి మానవ మృగంగా మారి కొన్ని సార్లు దారుణాలకు పాల్పడ్డట్లుగా జయకుమార్ ఆరోపిస్తున్నాడు. వర్మ బాధితులు అంతా తనతో కలిసి ముందుకు రావాలని, వర్మ అకృత్యాలకు ఇకపై అయినా బ్రేక్ వేసేలా కలిసి నడవాలి అంటూ జయకుమార్ పిలుపునిచ్చాడు. జయకుమార్ ఈ ఆరోపణలపై వర్మ ఎలా స్పందిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.