Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల నాటికి ఏపీ లో చంద్రబాబుకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు చేద్దామని కలలు కంటున్న వైసీపీ అధినేత జగన్ కి అనుకోని షాక్ తగిలింది, లెఫ్ట్, జనసేన, లోక్ సత్తా తో కలిసి వైసీపీ మహాకూటమి ఏర్పాటు చేయాలని, లేదంటే గెలుపు కష్టమని వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పడంతో ఆ దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారు. అప్పటిదాకా మౌనంగా వున్న పవన్ ఎప్పుడైతే ఈ ప్రయత్నాలు మొదలు అయ్యాయో అప్పుడే అమరావతి వెళ్లి ఉద్దానం సమస్యపై బాబుతో చర్చించి వచ్చారు. ఇక చంద్రబాబు వ్యవహారశైలి మీద ఎక్కువగా విమర్శలు చేసే లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సైతం ఇప్పుడు నిజం అంగీకరించారు. ఇదే ఇప్పుడు నంద్యాల ఎన్నికల జంక్షన్ లో నిలుచున్న వైసీపీ అధినేత జగన్ కి మంట పుట్టిస్తోంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా…
ఏపీ సర్కార్ పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదన తెచ్చినప్పుడు జేపీ దానిపై తీవ్ర విమర్శలు చేశారు. దాన్ని ఓ పిచ్చి ప్రాజెక్ట్ గా అభివర్ణించారు ఆయన. పోలవరాన్ని పక్కనబెట్టడానికే ఈ పట్టిసీమని ముందుకు తెస్తున్నారని జయప్రకాశ్ అప్పట్లో అన్నారు. అయితే అనుకున్నదానికి భిన్నంగా పట్టిసీమ సర్కార్ చెప్పిన టైం కి పూర్తి కావడంతో పాటు రెండేళ్లుగా ఆ ప్రాజెక్ట్ వల్ల గోదావరి జలాలు కృష్ణా డెల్టా , సీమ రైతుల పంటని కాపాడ్డంతో జేపీ మనసు మారింది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది 30 టీఎంసీ ల నీరు పట్టిసీమ వల్ల పంట పొలాలకు మళ్లడాన్ని గమనించిన జేపీ తన మాట కూడా మార్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వచ్చిన ఆయన పట్టిసీమ ప్రయోజనాన్ని పొగిడారు. ఆ ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకి మేలు జరిగిందని ఒప్పుకున్నారు.
నంద్యాల ఉపఎన్నికల బరిలో జోరుగా ప్రచారం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ కి జేపీ వ్యాఖ్యలు శరాఘాతంగా మారాయి. దీంతో ఆయన ఆదేశాలకు అనుగుణంగా వైసీపీ అనుకూల సోషల్ మీడియా జేపీ మీద విష ప్రచారానికి తెర లేపింది. ఎప్పటిలాగానే ఆయనకు కుల ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది.
మరిన్ని వార్తలు: