Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినా, మౌనంగా వున్నా ఓ సంచలనమే. విశాఖ ఎయిర్ పోర్ట్ లో వీరంగం తర్వాత ఆయనపై దేశీయ విమానయాన సంస్థలు నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ లో గన్నవరం వెళ్లేందుకు ఆయన ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. అయితే నిషేధాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రూ జెట్ సంస్థ ఆయనకు బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన కారులోనే విజయవాడ వచ్చారు. అక్కడ జరిగిన టీడీపీ ఎంపీల సమావేశంలో పాల్గొన్నారు.
ఎంపీ ల సమావేశం నుంచి బయటకు వస్తున్న జేసీ ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సమావేశంలో విశాఖ ఎయిర్ పోర్ట్ వివాదం గురించి చర్చ వచ్చిందా అని జేసీ ని అడిగారు. దానికి ఆయన బదులిస్తూ అలాంటిదేమీ లేదన్నారు. పైగా ఈ సమావేశంలో కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక గజపతి రాజు ఉన్నప్పటికీ ఆయన కూడా తననేమీ అడగలేదని జేసీ చెప్పారు. అంతటితో ఆగకుండా విశాఖ వివాదం మీద తానేమీ మాట్లాడబోనని జేసీ తెలిపారు. తానొకటి చెపితే ఇంకోటి చూపిస్తున్నారని విలేకరుల్ని నిష్టూరం ఆడిన జేసీ ఇంకో బాంబు లాంటి కామెంట్ చేశారు. మీడియా మేనేజ్ మెంట్స్ తమ మీద ఆధారపడి పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే ఆ మీడియా అధిపతుల పేర్లు బయటికి చెప్పకపోవడంతో జేసీ ఎవరి గురించి మాట్లాడారో జర్నలిస్టులకి అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఏదైనా మీడియా సంస్థ కి జేసీ సన్నిహితంగా ఉన్నట్టు ఆధారాలు దొరుకుతాయేమోనని వెదుకుతున్నారు.
మరిన్ని వార్తాలు
నితీష్ పొగబెట్టినా లాలూ పోనంటున్నాడు.
అప్పుడు బైబిల్…ఇప్పుడు అమ్మవారి అక్షింతలు.