Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్టీఆర్ మరో మూడు రోజుల్లో ‘జైలవకుశ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలైన వెంటనే ‘బిగ్‌బాస్’ షో కూడా ముగియబోతుంది. దాంతో రెండు నెలల పాటు ఎన్టీఆర్ ఎవరికి కనిపించకుండా విదేశాలకు చెక్కేయనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారం కొంచెం నిజం, కొంచెం అబద్దం అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. తాను కుటుంబంతో కలిసి ండన్ వెళ్లబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, అయితే ఏదైనా దేశానికి మాత్రం వెళ్లడం ఖాయం, అది ఏ దేశం అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక తన తర్వాత సినిమా త్రివిక్రమ్‌తో అని అధికారికంగా చెప్పేసిన ఎన్టీఆర్, ఆ సినిమా కోసం కొత్త లుక్‌ను ట్రై చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు. మార్షల్ ఆర్ట్స్‌ను ఎన్టీఆర్ రెండు నెలల పాటు ట్రైనింగ్ తీసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఎన్టీఆర్ స్పందిస్తూ త్రివిక్రమ్ కొత్త లుక్ కావాలని చెప్పారు. అందుకోసం ఏం చేయాలి అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని, కొత్తగా మాత్రం కనిపిస్తాను అంటూ ఎన్టీఆర్ మీడియాలో వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూడా ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘జై లవకుశ’ చిత్రంతో ఎన్టీఆర్ స్థాయి అమాంతం పెరగడం ఖాయం అని, ఆ తర్వాత చేయబోతున్న త్రివిక్రమ్ సినిమాతో టాలీవుడ్ నెం.1గా ఎన్టీఆర్ నిలుస్తాడని నందమూరి అభిమానులు నమ్మకంగా అంటున్నారు.