Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ సారి తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. నాలుగు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు అభయ్ రామ్‌కు తల్లిదండ్రులు అయ్యారు. ఈసారి ఎన్టీఆర్ తనకు కూతురు కావాలని కోరుకుంటున్నాడట. మొదటి కాన్పులో లక్ష్మీ ప్రణతి బాబుకు జన్మనివ్వగా, రెండవ కాన్పులో పండంటి పాపాయికి జన్మనివ్వాలని ఎన్టీఆర్ కోరిక అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్టీఆర్‌కు ఆడపిల్లలు అంటే చాలా అభిమానం. ఆడవారిని అమితంగా గౌరవించే ఎన్టీఆర్ పాప కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన అభిమానులు అంతా కూడా ఆయన కోరిక తీరాలని ప్రార్థిస్తున్నారు.
మరో ఆరు నెలల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి డెలవరీ అవ్వనుందని, అప్పటి వరకు ఎన్టీఆర్‌కు పాపా లేదా బాబు అంటూ టెన్షన్ తప్పదని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. చాలా కాలంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది. ఇక ఎన్టీఆర్ తాను కోరుకుంటున్న పాప కూడా జన్మించాలని ఫ్యాన్స్ మరియు ఎన్టీఆర్‌కు ఆప్తులు అయిన వారు కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ కోరిక తీరేనా లేదా అనేది చూడాలి.