అభ‌య్ వ‌ల్లే జీవితం అంటే ఏమిటో తెలిసింది…

junior-ntr-talks-with-her-son-abhay-ram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎవ‌రి జీవితాల్లోన‌యినా పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత సంతోషం వ‌స్తుంది. చాలామందికి ఇక పిల్ల‌లే ప్ర‌పంచం అయిపోతారు. పిల్ల‌ల ముద్దులొలికించే మాట‌లు, వారి హావభావాలు పెద్ద వాళ్ల‌కు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడ‌తాయి. పిల్ల‌ల వ‌ల్ల జీవితంలో కొత్త అనుభూతులు సొంత‌మ‌వుతాయి. సామాన్యులే కాదు…సెల‌బ్రిటీలు ఇందుకు మిన‌హాయింపు కాదు. త‌న కొడుకు అభ‌య్ రామ్ పుట్టిన త‌ర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసిందంటున్నారు ఎన్టీఆర్. అభ‌య్ పుట్టిన త‌ర్వాత ఎక్కువ‌స‌మ‌యాన్ని త‌న‌తోనే గ‌డుపుతున్నాన‌ని తార‌క్ చెప్పారు. కొడుకు త‌న జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న దృక్ప‌థం మారింద‌ని, త‌న కెరీర్ లోనూ మార్పు వ‌చ్చింద‌ని అన్నారు ఎన్టీఆర్. అభ‌య్ తో ఆడుకోవ‌డం త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పారు. కుమారుడు పుట్టిన త‌ర్వాత జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నానంటూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు ఎన్టీఆర్. ఇవాళ రిలీజైన ఆయ‌న సినిమా జైల‌వ‌కుశ‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేసిన తార‌క్ మూడు పాత్ర‌ల్లోనూ జీవించేశాడ‌ని సామాన్యులే కాదు..సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.