‘మనం’కు ఎందుకు అవార్డు ఇవ్వలేదో చెప్పిన జ్యూరీ

Jury Members says reason why did not give award to Manam Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇటీవల ప్రకటించిన నంది అవార్డులు వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. బాలకృష్ణ నంది అవార్డుల జ్యూరీలో మెంబర్‌గా ఉండి, తాను నటించిన లెజెండ్‌ సినిమాకు పెద్ద మొత్తంలో అవార్డులు కట్టబెట్టుకోవడంతో పాటు, స్వయంగా తాను నంది అవార్డును తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. బాలయ్యకు అవార్డు రావడంపై విమర్శలు చేస్తూనే కొందరు మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని అంటున్నారు. ఇంకొందరు మంచి సినిమాలను వదలేసి పెద్దగా ప్రేక్షకాధరణ దక్కని సినిమాలకు అవార్డును కట్టబెట్టారు అంటూ ఆరోపిస్తున్నారు. అక్కినేని హీరోల మల్టీస్టారర్‌ చిత్రం ‘మనం’కు అవార్డు వస్తుందని అంతా ఆశించారు. కాని మనం సినిమాను కనీసం జ్యూరీ సభ్యులు పరిగణలోకి కూడా తీసుకోలేదని తెలుస్తోంది.

Nandi-awrds-2014-16

నంది అవార్డుల రూల్స్‌ ప్రకారం దెయ్యాల సినిమాలు, పూర్వ జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు అవార్డుకు అనర్హం. అందుకే ‘మనం’ సినిమాను అవార్డుల పరిగణలోకి తీసుకోలేదని జ్యూరీ మెంబర్స్‌ చెబుతున్నారు. ఇలాంటి చెత్త నిర్ణయం చెప్పి మనం సినిమాకు అవార్డు ఇవ్వక పోవడం వారి పక్షపాతంను చూపిస్తుందని కొందరు అక్కినేని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు గుర్తుండి పోయే సినిమా ‘మనం’. అలాంటి సినిమాకు అవార్డు దక్కక పోవడంను సినీ వర్గాల వారు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ‘మనం’ సినిమాకు ఏదైనా కేటగిరిలో అవార్డు దక్కి ఉంటే బాగుండేది.