తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ 2.ఓ చిత్రం తరువాత తన తదుపరి చిత్రంను లోకనాయకుడు కమల్ హసన్ తో అప్పట్లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తీస్తాను అని 2.ఓ చిత్రం షూటింగ్ సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ స్క్రిప్ట్ వర్క్ పైన పూర్తి దృష్టి పెట్టాడు. కమల్ హసన్ కూడా తన బాడీలాంగ్వేజ్ ను ఈ చిత్రం కోసం తయ్యారు చేస్తున్నాడు. ఈ చిత్రంలో కమల్ సరసన ఎవరు కథానాయక అనేది సస్పెన్స్ గా ఉంచాడు శంకర్. ఇప్పుడు ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది.తాజాగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ… లోకనాయకుడు కమల్ హసన్ తో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది.
కాజల్ అగర్వాల్ తెలుగు లో దాదాపుగా అగ్ర హీరోస్ సరసన నటించింది. ఇంకా కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళంలో సినిమా అవకశాలు తాగుతున్నాయి అనుకుంటున్నా తరుణంలో కమల్ శంకర్ కాంబో లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో శింభు కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ భారతీయుడు 2 లో విలన్ పాత్రను పోసిస్తున్నట్లు సమాచారం ఇంకా చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావలిసి ఉన్నది. 2.ఓ ను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ 200 కోట్లు తో భారతీయుడు 2 ను నిర్మిస్తుంది. వచ్చే నెలలో ఈ సినిమా పట్టలేకే అవకాశం ఉంది.