బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించినా చిత్రం కవచం. ఈ చిత్రం ఇటివల ఒక ఫంక్షన్ ను జరుపుకుంది. ఆ ఫంక్షన్ లో కాజల్ అగర్వాల్ పై స్టేజి పైన ప్రముఖ కెమెరా మ్యాన్ చోటా కె నాయుడు మాట్లాడుతూ కాజల్ అగర్వాల్ ను సడన్ గా మెడపైన ముద్దు పెట్టుకున్నాడు. కాజల్ కూడా ఒక్కసారిగా షాక్ తిన్నది చోటా చేసిన పనికి. ఆ తరువాత చోటను, కాజల్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. కాజల్ అగర్వాల్ కూడా చోటపైన ఛాన్స్ పై డాన్స్ అంటూ కౌంటర్ వేసింది. మరికొందరు మాత్రం ఆ విషయాని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు ఈ విషయం పైన మరోసారి కాజల్ అగర్వాల్ స్పందించింది. నేను ఈ విషయాని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ సంఘటన తరువాత చోటా నాతో మాట్లాడారు నాకు స్వారి చెపుతూ నువ్వు ఏమైనా ఫీల్ అయ్యావ అని అడిగారు. నేను చేసింది తప్పుఅని మీకనిపిస్తే మాత్రం నన్నుక్షమించండి అన్నారు అని వివరణ ఇచ్చారు అని చెప్పింది. కాజల్ అగర్వాల్ ఫాన్స్ ను రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ చోటపైన ట్రోల్స్ ఆపండి అంటూ సమాధానమిచ్చింది. చోటా మా కుటుంబంలో సభ్యుడు లాంటి వాడు నేను ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు అన్నది. ప్రస్తుతం కాజల్, కమల్ హసన్ తో భారతీయుడు 2 సీక్వెల్ కోసం వెయిట్ చేస్తుంది.