కల్కి మూవీ వాయిదా పై మరోసారి వార్తలు.. మూవీ ఎప్పుడంటే..?

కల్కి మూవీ వాయిదా పై మరోసారి వార్తలు.. మూవీ ఎప్పుడంటే..?
Cinema News

ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ మూవీతో ఫుల్ పండగ చేసుకున్నారు అయితే ఇప్పుడు కల్కి మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. కల్కి కు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో పలు వార్తలు కనపడుతున్నాయి అలానే పలు అప్డేట్స్ని కూడా ఇప్పటికే చిత్రీ యూనిట్ ఇచ్చింది ప్రభాస్ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది ఈ మూవీ డబ్బింగ్ పనులన్నీ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న మూవీ ఇది వైజయంతీ మూవీస్ బ్యానర్లు అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

కల్కి మూవీ  వాయిదా పై మరోసారి వార్తలు.. మూవీ  ఎప్పుడంటే..?
Kalki 2898AD

నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం ఇస్తున్నారు ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతోంది ఫస్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోందట. మే 9న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది ఈ మూవీకి హాలీవుడ్ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది అయితే కల్కి మూవీ వాయిదా పడిందని ఆగస్టు 15న విడుదల కాబోతోందని సమాచారం మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.