Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇవాంకా ట్రంప్, ప్రధాని మోడీ రాకతో దేశమంతా ఒక్కసారి హైదరాబాద్ వైపు చూసింది. ఆ చూస్తున్నప్పుడు ప్రధాని , ఇవాంకా తో పాటు గవర్నర్ నరసింహన్ , సీఎం కెసిఆర్, మంత్రి కె. తారకరామారావు కనిపించారు. ఈ ముగ్గురిలో కూడా కేటీఆర్ చురుగ్గా కనిపించారు. మెట్రోలో ప్రయాణం చేసేటప్పుడు ప్రధాని మోడీ పక్కనే కేటీఆర్ కూర్చున్నారు. తండ్రి కన్నా ఎక్కువగా మోడీతో మాటలు కలిపారు. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే ఇంకో వైపు ఏమైంది ? ఇప్పుడు అధికార తెరాస లో ఇదే చర్చ సాగుతోంది. కేటీఆర్ తో పాటు కెసిఆర్ వారసత్వానికి పోటీ అని భావిస్తున్న హరీష్ రావు ఎక్కడా కనబడలేదు. దీని వెనుక కారణాల మీద రకరకాల వ్యాఖ్యానాలు , కధలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో కేటీఆర్ హవా సాగుతున్న టైం లో అంటే మంగళవారం ఉదయం కల్లా హరీష్ రావు ఢిల్లీలో ప్రత్యేక్షం అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అటవీ,పర్యావరణ అనుమతుల కోసం కేంద్రాన్ని అభ్యర్ధించడానికి హరీష్ ఢిల్లీ వచ్చారట. జలవనరుల సంఘం అధికారులతో హరీష్ ఈ విషయం తో పాటు తెలంగాణకు సంబంధించిన మిగిలిన సమస్యలపై కూడా దృష్టి పెడతారట. అయితే జలవనరుల సంఘం అధికారులతో నేడు సమావేశం అయితే నిన్న ఉదయమే హరీష్ ఢిల్లీ రావడం ముందు జాగ్రత్తే. ఆ ముందు జాగ్రత్త హరీష్ దేనా లేక కెసిఆర్ దా? ఈ విషయం గురించి బయటకు ఎవరూ మాట్లాడకపోయినా లోగుట్టు ఏమిటో అందరికీ తెలుస్తూనే వుంది