Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా తెరకెక్కిన ‘ఎమ్మెల్యే’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంతో ఉపేంద్ర మాధవ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ లుక్‌తో పాటు, కాజల్ గ్లామర్‌తో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. దాంతో పాటు గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు ఒక్క గట్టి చిత్రం వచ్చింది లేదు. వచ్చిన అన్ని చిత్రాలు కూడా ఇలా వచ్చి అలా వెళ్లి పోయాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎమ్మెల్యేపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. మంచి సమయంలో విడుదల కాబోతున్న ఎమ్మెల్యే చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్లో నిలిచి పోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈనె 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఎమ్మెల్యే’కు పోటీగా పెద్ద సినిమాలేవి లేవు. అదే రోజున విడుదల కాబోతున్న ‘రాజరథం’ మరియు ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రాల గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆ సినిమాలు ఎవరికి, అసలు ఆ చిత్రాల్లో నటించింది ఎవరు అనే విషయం సాదారణ ప్రేక్షకులకు తెలియదు. అందుకే ‘ఎమ్మెల్యే’ చిత్రానికి పోటీ ఉండక పోవచ్చు అంటున్నారు. ఆ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఎమ్మెల్యే సినిమాపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. మినిమం పాజిటివ్ టాక్ దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే చిత్రంకు మంచి కలెక్షన్స్ ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.