Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘నానువ్వే’ చిత్రం విడుదల ఇప్పట్లో అయ్యేలా లేదు. కళ్యాణ్ రామ్ గత చిత్రం ఎమ్మెల్యే కంటే ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేయడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. మొదట ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయాలని భావించారు. ఆ రోజు నేలటికెట్ విడుదల ఉన్న కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ చిత్రంను జూన్ 1కు వాయిదా వేశారు. ఆ రోజు కూడా పలు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దాంతో ఆ రోజున కూడా చిత్రాన్ని విడుదల చేయడం లేదని తెలుస్తోంది.
‘నానువ్వే’ చిత్రంపై దర్శకుడు జయేంద్ర చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆయనకు ఈ చిత్రంపై చాలా నమ్మకం ఉంది. అందుకే సరైన సమయంలో విడుదల చేయాలని పట్టుబడుతున్నాడు. ఆయన కోరిక మేరకు రెండు సార్లు విడుదల వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. మరో వైపు కళ్యాణ్ రామ్ సినిమా వాయిదా పడుతున్న నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా పదే పదే వాయిదాలు వేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణ్ రామా ఏంటీ ఈ వాయిదా పద్దతి అంటూ సోషల్ మీడియాలో స్వయంగా నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్‌కు కూడా అంచనాలున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించి ఆకట్టుకుంది. అందుకే ప్రేక్షకులు అంతా కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.