Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ హీరో కళ్యాణ్ రామ్ కొంత కాలంగా వరుస సినిమాలను చేస్తున్నాడు. తాజాగా జయేంద్ర దర్శకత్వంలో మిల్కీ బ్యూటి తమ్ముతో కలిసి కళ్యాన్ రామ్ ‘నా నువ్వే’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగానే కళ్యాన్ తన తదుపరి సినిమాకి ప్రిపేర్ అవుతున్నాడు. ‘నా నువ్వే’ సినిమా వచ్చే నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానున్నది. కళ్యాన్ రామ్ తన తర్వాతి సినిమాని ప్రముఖ కెమెరా మెన్ అయిన గుహాన్ దర్శకత్వంలో చేయనున్నాడు.
ఈ నెల 25 న లాంచ్ చేయనున్న ఈ సినిమాలో కళ్యాన్ రాంకి జంటగా నివేదా థామస్ ..శాలిని పాండే నటించనున్నారు. వరుస విజయాలను అందుకుంటున్న నివేదా- నాని తో కలిసి నిన్ను కోరి సినిమాలో నటించి యూత్ కి మతిపోగేట్టేల చేసింది.తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి పిల్ల శాలిని పాండే వరుస సినిమాలు చేస్తూ సింగర్ గా కుడా తన సత్తా చాటుతుంది.వీరిరువురి కాంభో లో రానున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.