Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓవైపు రజనీకాంత్ రాజకీయాలపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. జనానికి చిరాకు తెప్పిస్తుంటే.. కమల్ మాత్రం ఒక్క ట్వీటుతోనే తంబీలకు హుషారు తెచ్చారు. సమకాలీన అంశాలపై నిత్యవిమర్శలు చేసే కమల్ హాసన్.. జయ మరణం తర్వాత రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకేను టార్గెట్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో వివాదం తరుణంలో.. మరో సంచలన కవితను ట్వీట్ చేసి దుమారం రేపారు.
కిరీటం వదులుకున్నంత మాత్రాన నేను నాయకుడిని కాదా. నేను ఎప్పటికీ తీవ్రవాదినే. ఎవరు వ్యతిరేకించినా బలంగా పోరాడతాను. తలుచుకుంటే నేనే నాయకుడ్ని అంటూ కమల్ చేసిన ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో కలకలం రేపింది. కమల్ ట్వీట్ పై స్పందించిన సీఎం పళనిస్వామి.. ముందు రాజకీయాల్లోకి రా.. తర్వాత మాట్లాడదామన్నారు.
మాజీ సీఎం పన్నీర్ సెల్వం మాత్రం కమల్ కు మద్దతు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అభిప్రాయాలు వెలిబుచ్చే స్వేచ్ఛ ఉందన్నారు. కానీ కమల్ కేవలం బిగ్ బాస్ షోను డిఫెండ్ చేయడానికి ట్వీట్ చేశారని జనం ఆశ్చర్యపోతున్నారు. కమల్ హాసన్ కు ఇలాంటి ట్రిక్కులు కొత్త కాదని తలైవా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
మరిన్నివార్తలు