Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాట అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్ మరో వైపు సినిమాలను కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ మద్య సినిమాలు చేయను అంటూ చెప్పినా కూడా ముందే ఒప్పుకున్న కొన్ని చిత్రాను కమల్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ముందుగా కమల్ హాసన్, శంకర్ల కాంబినేషన్లో ‘భారతీయుడు 2’ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ రీమేక్‌ను బాలీవుడ్లో కూడా భారీగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో హిందీ స్టార్ హీరో అజయ్ దేవగన్‌ను ముఖ్య పాత్రలో తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
తమిళనాట రాజకీయ యాత్ర చేస్తున్న కమల్ హాసన్ మరో వైపు ‘భారతీయుడు’ సీక్వెల్ పనులను కూడా సమీక్షిస్తూ ఉన్నాడట. తాజాగా దర్శకుడు శంకర్ ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌ను తీసుకోవాలనే ఆలోచనను కమల్ ముందు ఉంచడం, ఆయన వెంటనే ఓకే చెప్పడం జరిగిపోjయింది. ఇక కమల్‌తో అప్పుడప్పుడు స్క్రిప్ట్ చర్చలు కూడా శంకర్ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కమల్ హాసన్ రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా భారతీయుడు సీక్వెల్‌ను ముందుగా అనుకున్న ప్రకారం ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘2.0’ చిత్రం విడుదలైన తర్వాత ఈ సీక్వెల్ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉంది. రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం భారతీయుడును మించి ఉంటుందని, అవినీతి దేశంలో ఎలా ఉందో దర్శకుడు శంకర్ ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు.