Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం రేపు ఆవిష్కృతం కానుంది. విఖ్యాత నటుడు కమల్ హాసన్ రేపు రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు. మధురైలో రేపు సాయంత్రం ఆరుగంటలకు జరిగే భారీ బహిరంగ సభలో తాను పెట్టబోయే కొత్తపార్టీ పేరు, విధానాలు వెల్లడించనున్నారు. జెండా కూడా రేపే ఆవిష్కరించనున్నారు. ఈ సభకు హాజరు కావాలని ఆయన తమిళనాడు ప్రజలను కోరారు. పార్టీ ప్రకటనకు ముందు కమల్ హాసన్ మర్యాదపూర్వకంగా రజనీకాంత్, డీఎంకె అధినేత కరుణానిధిని కలుసుకున్నారు. అధికార అన్నాడీఎంకె చెత్తగా మారిపోవడం వల్లే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.
కమల్ ప్రకటించబోయే పార్టీపై తమిళప్రజల్లో జోరుగా చర్చసాగుతోంది. కమల్ రాజకీయవిధానం కాషాయ దళానికి వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తున్నారు. కమల్ కూడా చాలా సందర్భాల్లో అదే విషయం వెల్లడించారు. తన రాజకీయాల రంగు నలుపని వ్యాఖ్యానించడం ద్వారా తన రాజకీయ పయనమెటో స్పష్టంగా తెలియజేశారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఏర్పడ్డ అనిశ్చితి కమల్, రజనీకాంత్ ల రాజకీయ ప్రవేశంతో తొలగిపోతుందన్న భావన వ్యక్తమవుతోంది.