Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎవరు నువ్వు అని కోపంతో అడిగిన పవన్ ఫాన్స్ కి “నేను ఫిలిం క్రిటిక్ అబ్బా “ అని కత్తి మహేష్ సమాధానం ఇవ్వడం సోషల్ మీడియా సాక్షిగా లక్షల మంది విన్నారు. ఫిలిం క్రిటిక్ కాస్తా కొన్నాళ్లుగా పొలిటికల్ క్రిటిక్ అవతారం ఎత్తారు . పవన్ కళ్యాణ్ జనసేనని టార్గెట్ చేస్తూ కత్తి విమర్శలు చేస్తుంటే ఫాన్స్ చేసిన గొడవకు హర్ట్ అయ్యి అలా చేస్తున్నారులే అనుకున్నారు చాలా మంది. అయితే అది కోపంతో కాదు ఓ వ్యూహం ప్రకారం ఓ పార్టీ చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాటికి ఊతం ఇచ్చేలా వుంది కత్తి ప్రవర్తన కూడా.
ఇటీవల దేవాదాయశాఖ జనవరి 1 న నూతన సంవత్సరం అంటూ ప్రత్యేక పూజలు, అలంకరణలు వద్దని ఓ ఆదేశం ఇచ్చింది. దాన్ని చంద్రబాబుకి అన్వయిస్తూ కత్తి ఓ కామెంట్ చేశారు. సరేలే అనుకుంటే ఇంతలో ఫాతిమా కాలేజీ వ్యవహారం త్వరగా తేల్చాలని పవన్ తాజాగా చంద్రబాబుకి లేఖ రాయడం మీద కూడా కత్తి కామెంట్స్ చేశారు. విద్యార్థుల జీవితాలతో ముడిపడిన సీరియస్ సమస్యని వదిలిపెట్టి పరిష్కారం జరుగుతున్న ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తోడు దొంగలు అంటూ కత్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో ఆయన వేసుకున్న క్రిటిక్ ముసుగు తొలిగిపోయి ఓ రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని అర్ధం అవుతోందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, పవన్ తోడు దొంగలు అయితే ప్రజాధనాన్ని దోచుకుని జైలుకు కూడా వెళ్లొచ్చిన జగన్ ని ఏమని పిలవాలో చెప్పమని కత్తి మహేష్ ని నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నకు బదులు ఇవ్వడానికి కూడా కత్తి ఆ పార్టీ అనుమతి తీసుకోవాలేమో పాపం.