తెలంగాణ లో ముందస్తు ఎన్నికలు వస్తున్న సందర్భంలో కెసిఆర్ కొన్ని సంచలనాత్మక నిర్ణయాయి తీసుకొని అందరిని ఆశర్య పరుస్తున్నారు. కెసిఆర్ తీసుకునే కొన్ని నిర్ణయాలు కొందరి నాయకలు భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి . కెసిఆర్ మొదటి నుంచే చెప్తున్నట్టు దాదాపుగా సిట్టింగులకే టికెట్లు కేటాయించి అందరిని ఆశర్య పరిచారు. కెసిఆర్ ఏదైనా మాట ఇచ్చారంటే దానికే కట్టుబడి ఉంటారని అందరికి తెల్సిన విషయమే, ఆ మాటని నిజం చేస్తూ సిట్టింగ్ లకి టికెట్ లు ఇచ్చి రుజువు చేసారు. అయితే ఇలాంటి కొన్ని నిర్ణయాలు వాళ్ళ కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని తెలుస్తుంది. అయితే కెసిఆర్ ఒక నేతకి ఇచ్చిన టికెట్ వాళ్ళ అందరిని ఆశ్యర్యపరిచింది, అతని రాజకీయ భవిష్యత్తు లో ఎటువంటి విమర్శలు లేకపోయినప్పటికీ, ఆ రాజాకీయ నేత తీవ్ర అనారోగ్యం తో ఉన్నట్టు తెలుస్తుంది ఇటువంటి సమయం లో అతనికి టికెట్ ఇవ్వడం వాళ్ళ కొందరి నుండి తీవ్ర విముఖత ఏర్పడింది.
మొదటిగా ఈ టికెట్ ను అతని కుమారుడికి కానీ లేదా వేరే రాజకీయా నేత కి ఇస్తారని అందరు అనుకున్న వాళ్ళందరి అంచనాలను కెసిఆర్ తారుమారు చేసారు. ఆ మంత్రి ఎవరో కాదు వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజవకర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న అజ్మీరా చందూలాల్. అజ్మీరా గత కొద్దీ సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్నారు. కెసిఆర్ అతని వైపే మొగ్గు చూపు అజ్మీరా నే పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగించాలని అనుకుంటున్నారు. అయితే ఇదే విషయం లో అజ్మీరా కొడుకు తీవ్ర అసంతృప్తి కి గురి అయినట్టు తెలుస్తుంది.అయితే ఆ నియోజకవర్గం నుంkcr decision on Azmeera Chandulal,kcr,telangana,telangan cm,hyderabad,Telangana Tourism,warangal mp,warangalడి అతనికి టికెట్ ఇవ్వడం పై క్యాడర్ లో చాలా మంది కెసిఆర్ పై అసంతృప్తి తో ఉన్నారు. ఆ మంత్రి తీవ్ర అనారోగ్యం తో ఉన్నారని అతనికి టికెట్ ఇవ్వడం అంత మంచిది కాదని టికెట్ దక్కించుకోవాలని ఆశతో కొందరు గట్టిగ ప్రయత్నిస్తున్నారు. అది కూడా గిరిజనులకు సంబందించిన వాళ్ళకే మంత్రి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్నీ పార్టీ లోని పెద్దనాయకులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. ఆ నియోజక వర్గం లో ఆదివాసి గిరిజనలు ఎక్కువ గా ఉన్నారని వాళ్ళకి ఇస్తేనే పార్టీ కి లాభం అని అంటున్నారు. ఒకవేళ కెసిఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే వ్యతిరేకత తప్పదని చెప్తున్నారు. మరి మాట మీద నిలబడే కెసిఆర్ ఒత్తిడి కి లొంగుతారా లేక తన నిర్ణయానికె కట్టుబడి ఉంటారా అన్న విషయం భవిష్యత్తులో తెలిసిపోతుంది.