Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అత్యుత్సాహం పరిధులు దాటేలా చేస్తోంది. ఇప్పుడు సీఎంకేసీఆర్ కూడా అదే చేశారు. అదేంటి ఆయనే రాష్ట్రానికి పవర్ సెంటర్ కదా అనుకోవచ్చు. కానీ ఎంత అత్యున్నత పదవిలో ఉన్నా… అందర్ని గౌరవించడం సంస్కారం. కేసీఆర్ ఉద్యమ సమయంలోనే తనకు సంస్కారం లేదని చాటుకున్నారనుకోండి. అది వేరే విషయం. కానీ తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రోళ్లను ఆడిపోసుకుంటున్న కేసీఆర్… ఐఏఎస్ లను కూడా అవమానించారని వాదన తెరపైకి వచ్చింది.
సిద్ధిపేట జిల్లా కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు కేసీఆర్. గొల్లకురుమల ప్రత్యేకత గురించి చాలా చెప్పారు. అందులో ఎవరికీ అబ్జెక్షన్ లేదు. కానీ ఐఏఎస్ లు కూడా గొల్లకురుమల్లా గొర్రెల్ని గుర్తించలేరన్న కామెంట్ పై వివాదం రాజుకుంది. గొల్లల గొప్పలు చెప్పడానికి… ఐఏఎస్ లను ఎందుకు అవమానించారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. మాటల మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ పొరపాటు పడ్డారా… లేదంటే ఉద్దేశపూర్వకంగా అధికారులకు చురకలేశారా అనే చర్చ జరుగుతోంది.
కానీ చాలా మంది సీనియర్ ఐఏఎస్ లు సీఎం మాటలకు హర్టయ్యారట. గొర్రెల్ని గుర్తించడానికి తాము ఐఏఎస్ లం కాలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారట. ఎవరి వృత్తులు వారికి గొప్పవేనని, అంతమాత్రాన ఇతరుల్ని కించపరచాల్సిన అవసరం లేదని అంటున్నట్లు వినికిడి. రాజకీయ ప్రయోజనాల కోసం అందరినీ ఐఏఎస్ లతో పోల్చడం ఫ్యాషనైపోయిందని పలువురు అధికారులు సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట.