ఓటుకు నోటు కేసును తెరమీదకి తెచ్చింది అందుకేనా ?

KCR meeting with Police officers over Chandrababu Cash for vote case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ఒక కుదుపు కుదిపి సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెర మీదకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఈ అంశం పై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏసీపీ డీజీ పూర్ణచంద్రరావు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఏకేఖాన్‌‌తో పాలు పలువురు అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సమావేశానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ను కూడా పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటుకు నోటు ఉదంతం చోటుచేసుకున్న సమయంలో తెలంగాణ ఏసీబీ డీజీగా ఏకే ఖాన్‌ ఉన్నారు. సీఎంవో పిలుపు మేరకు ఆయన ప్రగతి భవన్‌కు వచ్చి సమావేశంలో పాల్గొన్నారు.

అయితే సదరు కేసులో వాయిస్‌ రికార్డుపై ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చిన నివేదికను దర్యాప్తు అధికారులు తాజాగా సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇకపై ఏవిధంగా ముందుకెళ్లాలనే అంశంపై అధికారులతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. అయితే మొన్ననే గవర్నర్‌తో సుదీర్ఘంగ చర్చించిన సీఎం కేసీఆర్‌… ఈరోజు పోలీసు అధికారులతో సమావేశమవడంతో సదరు సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ పై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై నాయ్యనిపుణుల సూచనలు, సలహాలు కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ నివేదిక రావటంతో… ఓటుకు నోటు కేసులో మళ్లీ చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే హ‌ఠాత్తుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంత దూకుడుగా స్పందించేంద‌కు కారణం ఫెడరల్ ఫ్రంట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

అదేంటంటే కొద్ది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్ర‌బాబు హైదరబాద్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ‌లోనూ పార్టీని బలోపేతం చేయాల‌ని అందుకు త‌గిన మ‌ద్ద‌తు తాను ఇస్తాన‌ని కార్యకర్తలకి కాస్త ధైర్యం నూరి పోశారు, అలాగే స‌మ‌స్య‌ల‌పై ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే కేసీఆర్ ఫ్రంట్ పేరుతో స్టంట్‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటి వరకు తనకి బాబు మద్దతు ఉంటుందని భావించిన కేసీఆర్ ఇప్పుడు బాబు మాటలతో ఖంగుతిని ఎలా అయినా బాబుని తమ వైపు తిప్పుకునే ఎత్తుగడ అని విశ్లేషకులు అంటున్నారు. అదీ కాక ఈ మధ్య కేంద్రం పై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన త‌రువాత‌ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వివిధ పార్టీల నేత‌లని కలిసిన ఆయనకీ అన్ని పార్టీల నుంచి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. అదే స‌మ‌యంలో బాబు మీదనే ఫోకస్ పెట్టిన జాతీయ మీడియా చంద్రబాబు దాదాపు అన్ని రాష్ట్రాలలోను ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కూట‌మి ఏర్పాటు చేయనున్నారంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి.

అదీ కాక నిన్న అమ‌రావ‌తిలో బీజేపీ పాలనేతర రాష్ట్రాలకి(11) చెందిన ఆర్థిక‌ మంత్రుల స‌మావేశం నిర్వ‌హించారు. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధి విధానాల‌ను మార్చాలంటూ త్వ‌ర‌లోనే అంతా క‌లిసి రాష్ట్రప‌తిని కలవాలని తీర్మానించారు. అయితే, జాతీయ స్థాయిలో ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చెయ్యాలని బాబు ఎక్కడా బయటపడకపోయినా ఢిల్లీ బేస్ గా తన పాత కాంటాక్ట్స్ అన్నీ లైన్ లో పెడుతున్నారు అని చెప్పకతప్పదు. కేసీఆర్ కూటమి ఏర్పాటు చేస్తానని హడావిడి చేస్తున్నాడు, బాబు సైలెంట్గా గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. దీంతో ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ అంటేనే మూడవ ప్రత్యామ్నాయం అని ఇప్పుడు చంద్రబాబు ఎంటర్ అయితే పరిస్తితులు మారి పోయి తన కూటమి డమ్మీ అవుతుందని, బాబుని విమర్శించాలన్నా కార్నర్ చేయలాన్నా మన దగ్గర ఉన్నదీ ఏకైక అస్త్రం అదీ వోటుకు నోటు కేసు అని దానిని బూచిగా చూపించి బాబు దూకుడికి కళ్ళెం వేయాలని కేసీఆర్ భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఒకరేమో అపర చాణక్యుడు మరొకరేమో వ్యూహాలు పన్నడంలో పండి పోయిన వారు చివరికి ఈ అంశం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి మరి.