Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొత్తం మీద తెలంగాణలో ప్రతిపక్షాలే లేవని విర్రవీగుతున్న కేసీఆర్ కు నేరెళ్ల ఘటన షాకిచ్చిందనే చెప్పాలి. ఒక్కసారిగా దళితుల పేరుతో కాంగ్రెస్ ఎటాక్ చేయడం, పైగా జాతీయ నేత మీరాకుమార్ ను రప్పించి మరీ సభ జరపడంతో గులాబీ బాస్ అలెర్టయ్యారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ను లైట్ తీసుకున్న కేసీఆర్.. ఇంకా అలాగే ఉంటే ప్రాబ్లమేనని నిర్ణయించుకున్నారు.
రెండు గంటల పాటు కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారంటేనే ఆయన ఉలికిపాటు అర్థమౌతోందని పీసీసీ నేతలు అంటున్నారు. ఇప్పటివరకూ కాంగ్రెస్ ను పెద్దగా పట్టించుకోని కేసీఆర్.. ఇప్పుడు ఇంత విరుచుకుపడుతున్నారంటే నేరెళ్ల ఎపిసోడ్ సక్సెస్సే అంటున్నారు. కేసీఆర్ తీరు చూస్తుంటే ఉలిపికట్టె గుర్తుకొస్తోందని కాంగ్రెస్ నేతలు సెటైర్లేస్తున్నారు.
దొంగ సర్వేలు చేయించి, తన సర్వేలపై తనకే నమ్మకం లేని కేసీఆర్.. ఇప్పుడు కూడా నేరెళ్ల ఘటనలో ఇద్దరో, ముగ్గురో దళితున్నారని విషయం అంగీకరించారని హస్తం నేతలు సంబరపడుతున్నారు. కలిసికట్టుగా కదం దొక్కితే కేసీఆర్ వెన్నులో వణుకు ఖాయమన్న మాటలు రుజువయ్యాయని, ఇకపై ఇలాగే ముందుకెళ్లాలని ఉత్తమ్ సీనియర్లందరికీ ఫోన్ చేసి చెప్పారట. కానీ కేసీఆర్ ఇంత ఉలికిపడటం అటు గులాబీ పార్టీలో ఆందోళన పెంచుతోంది.
మరిన్ని వార్తలు:
రానా పార్సిల్ లో ఏముంది..?
అధికారం వచ్చినా.. బుద్ధి మారలేదు
జాతీయ పతాక రూపశిల్పి జయంతి స్పెషల్ …