ఎన్నికల రోజే కేసీఆర్ కు భారీ షాక్ !

On Meet With KCR Akhilesh Yadav Takes Rain Check Mayawati Silent

మోడీ మెడలు వంచి ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్లు తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికలు జరుగుతూండగానే పెద్ద షాక్ తగిలిదింది. తెలంగాణలో రిజర్వేషన్లు 67 శాతానికి పెంచుకునే అవకాశం ఇవ్వాలంటూ ప్రభుత్వం దాఖలు చేసి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రిజర్వేషన్లు 50 లోపు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. సాధ్యం కాద‌ని తెలుసు. కోర్టు కొట్టివేస్తుంద‌నీ తెలుసు. అయినా కేసీఆర్ ముస్లింల‌కు 12 శాతం, ఆదివాసీల‌కు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ఉద్దేశ పూర్వ‌కంగా ఇచ్చిన హామీ ఇది. అయితే, కేసీఆర్ ఊహంచ‌ని విష‌యం ఏంటంటే సుప్రీంకోర్టు దీనిపై పోలింగ్ రోజే షాక్ ఇస్తుంద‌ని. ఈ విష‌యంలో ఎటువంటి స‌వ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం లేద‌ని చెప్పింది. దీంతో ముస్లింలకు కెసిఆర్ టోపి పెట్టార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 67% ఇవ్వాలంటూ తెలంగాణ సుప్రీంకోర్టులో పిటిష‌ను వేసింది.

ఎన్నికల రోజే కేసీఆర్ కు భారీ షాక్ ! - Telugu Bullet

ఈ అభ్యర్ధనను ప‌రిశీలించిన కోర్టు దానిని సంపూర్ణంగా కొట్టేసింది.పోలింగ్ రోజు వ‌చ్చిన ఈ తీర్పు కేసీఆర్ గుండెల్లో రైళ్లు ప‌రుగెట్టేలా చేస్తోంది. తెలిసి కేసీఆర్ ద‌గా చేశాడ‌ని ముస్లింలు కేసీఆర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్లపై డిమాండ్లు వ‌స్తే దానిని అధ్య‌యనం చేయ‌డానికి మంజునాథ కమిషన్ వేసింది టీడీపీ స‌ర్కారు. మంజునాథ క‌మిష‌న్‌ నేతృత్వంలో దానిపై అధ్య‌యనం జ‌రిగి సాధ్యాసాధ్యాల‌ను ప్ర‌భుత్వానికి నివేదించింది. ఇలాంటి ఏ చ‌ర్య‌లు తీసుకోని కేసీఆర్ కేవ‌లం ఓట్ల రాజ‌కీయం చేశారు. రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాష్ట్ర సమితి కీలక హామీల్లో ఒకటిగా ఉన్నాయి. ముస్లింలకు బీసీల కోటాలో పన్నెండు శాతం, ఎస్టీకు మరో పన్నెండ శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. వాటిని కేంద్రానికి పంపగా ప్రస్తుతం అవి కేంద్రం వద్ద ఉన్నాయి. అధికారికంగా వాటిని తోసి పుచ్చకపోయినా ప్రధానమంత్రి మోడీ కానీ బీజేపీ అద్యక్షుడు అమిత్ షా కానీ తెలంగాణ వచ్చినప్పుడల్లా ముస్లిం రిజర్వేషన్లకు అంగీకరించే ప్రశ్నే లేదని చెబుతూ ఉంటారు. కానీ తమిళనాడు తరహాలో తమకు రిజర్వేషన్లకు నిర్ణయించుకునే హక్కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కానీ సుప్రీం మాత్రం కేసీఆర్ కు పెద్ద షాకే ఇచ్చింది.