Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వచ్చేదాకా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని ఎంతో మంది అనుకున్నారు. అయితే నంద్యాల ఫలితంతో ఆ అంచనాలన్నీ పటాపంచలు అయ్యాయి. టీడీపీ వ్యూహ చతురత, వైసీపీ బలహీనత ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇక 2019 ఎన్నికల దృష్టితో చూసినప్పుడు టీడీపీ మహాశక్తివంతం గా కనిపిస్తోంది. వైసీపీ తేలిపోయింది. ఒక్క ఉప ఎన్నికతో చంద్రబాబు మొత్తం పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని వైసీపీ ని కంగుతినిపించిన వైనం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ని బాగా ఇంప్రెస్స్ చేసిందట. అదే పద్దతిలో తాను కూడా తెలంగాణాలో ఓ ఉప ఎన్నికతో తెరాస కి ఎదురు లేదని చాటడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీ గా గెలిచి తెరాస లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి తో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు తెర లేపాలని కెసిఆర్ భావిస్తున్నారట. ఇప్పటికే కెసిఆర్ సలహాతో గుత్తా రాజీనామా లేఖ కూడా రెడీ అయిపోయిందట. కెసిఆర్ ఆదేశం అందిన వెంటనే ఆ లేఖ స్పీకర్ కి చేరుతుందట. ఎల్లుండి అంటే 14 వ తేదీన రాజీనామా లేఖ ఇవ్వడానికి సుఖేందర్ రెడీగా ఉన్నట్టు సమాచారం. అదే జరిగితే నంద్యాల తరహా రిజల్ట్ తో కాంగ్రెస్ కి కంగు పినిపించాలని కెసిఆర్ అనుకుంటున్నారు. నల్గొండ కాంగ్రెస్ లో నెలకొన్న విబేధాలు కూడా ఆయన ఆశలకు ఊపిరి పోస్తున్నాయి. మొత్తానికి పైకి ఎన్ని తిట్టినా గురువు బాటలోనే శిష్యుడు కూడా నడవబోతున్నాడట.
మరిన్ని వార్తలు: