Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సీఎం కేసీఆర్ ఈ మధ్య చాలా చిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదంటారు.. మళ్లీ జనంలోకి వెళ్లాలని ఎమ్మెల్యేలకు చెబుతారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఓవైపు సిట్టింగులందరికీ సీట్లు అంటూనే.. మరోవైపు ఎక్స్ ట్రాలు చేస్తే.. తోక కత్తిరిస్తాననీ చెబుతున్నారు. దీంతో కేసీఆర్ మనసులో ఏముందో ఎన్ని మీటింగులు పెట్టినా.. ఎమ్మెల్యేలకు అర్థం కావడం లేదు.
సమగ్ర భూసర్వే గురించి వివరించే నెపంతో ఎమ్మెల్యేలను ఆడుకున్నారు కేసీఆర్. రైతుల మనసులో చిరస్థాయిగా ఉండాలని, అందుకే ప్రతి ప్రజాప్రతినిధి మూడు గ్రామాల్లో పరిస్థితి సమీక్షించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగకూడదని చెప్పారు. కేసీఆర్ మాటలు విన్నాక టీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్ మొదలైంది. భవిష్యత్తులో ఎక్కడైనా కబ్జాలు బయటపడితే.. సదరు గ్రామాన్ని సర్వే చేసిన ఎమ్మెల్యేను బాధ్యుడ్ని చేస్తారేమోనని భావిస్తున్నారు.
ఇప్పటికే ప్రతిపక్షాలకు ప్రజలు నమ్మడం లేదని చెప్పిన కేసీఆర్.. చేసిన రెండు సర్వేల్లోనూ అగ్రస్థానాన్ని మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకే ఇచ్చారు. పైగా కొంతమంది మంత్రులైతే మరీ దారుణమైన పనితీరు కనబరిచారని కూడా చెప్పారు. ఇప్పుడు మళ్లీ సిట్టింగులందరికీ సీట్లిస్తానంటున్నారు. మరి అందరికీ ఇచ్చేటప్పుడు సర్వేలు ఎందుకని గులాబీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది.