Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన సింగపూర్ టూర్ మీద నార్త్‌కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులు, భద్రతా సిబ్బందితో పాటు తన వ్యక్తిగత సహాయకులను వెంట తీసుకెళ్లారు. అక్కడి ఆగని కిమ్… ఓ విచిత్ర పని చేసి తాజాగా వార్తల్లో నిలిచారు. అసలే ఇప్పటి టెక్నాలజీ ఆవులిస్తేనే పేగులు లేక్కేట్టేస్తున్న తరుణంలో తన వ్యక్తిగత విషయాలు బయటకు రాకుండా ప్లాన్ చేసుకున్నారు. ముఖ్యంగా తన హెల్త్ విషయంలో మరింత కేర్ తీసుకున్నట్లు అంతర్జాతీయ పత్రికలు చెబుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో శిఖరాగ్ర చర్చలకు సింగపూర్ వచ్చిన కిమ్… తన వెంట సెపరేట్‌గా ఓ మొబైల్ టాయ్‌లెట్ తెచ్చుకున్నారని తెలిసింది. కిమ్ కోసం స్పెషల్‌గా దీన్ని డిజైన్ చేయించారు. ప్రస్తుతం కిమ్ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థూలకాయుడైన కిమ్‌కు మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్లవాతం కూడా ఉన్నాయని, తన మల, మూత్రాదులను పరీక్షించి తన ఆరోగ్య రహస్యాల్ని పసిగట్టేస్తారన్నది ఆయన భయం. తన బలహీనతలు ప్రత్యర్థులు తెలుసుకునేందుకు అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారని అందుకే ఎలాంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్ చేయగల అత్యాధునికమైన టాయ్‌లెట్‌ను తయారు చేయించుకున్నారని దక్షిణ కొరియాకి చెందిన ఓ వార్తాపత్రిక రాసుకొచ్చింది.