HCU సమీపాన ఉన్న భూముల వేలం ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. భూముల వేలాన్ని ఉపహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూమల వేలాన్ని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా స్పందిచారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరిట ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు.





