గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముక్కు సూటిగా మాట్లాడే రాజకీయ నాయకుడు. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా నందమూరి హరి కృష్ణ కుటుంబం అన్నా నానీకి చాలా ఇష్టం. వాళ్ళ కోసం ప్రాణం పెట్టె రకం నానీ. నందమూరి కుటుంబంతో ఉన్న ఆ అనుబంధంతోనే అప్పుడు నానికి టీడీపీ గుడివాడ టికెట్ ఇచ్చారనే అభిప్రాయం ఉండేది. అయితే నాని గుడివాడలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకొని గుడివాడలో తిరుగులేని నేతగా ఎదిగారు. టీడీపీలో మంచిపేరు తెచ్చుకున్నారు. తరువాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయినా ఆయనకి నందమూరి కుటుంబం మీద అభిమానం ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. హరికృష్ణ మరణించిన సమయంలో ఓ వైవు బాధపడుతూనే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఓ స్నేహితుడిలా అండగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా హరికృష్ణ కుటుంబం మీద ఉన్న అభిమానం పోదని రుజువు చేసుకున్నారు.
ఈ నేపధ్యంలో తెలంగాణలో డిసెంబర్ 7 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి నువ్వా నేనా అన్నట్టు పోరుకి సిద్ధమయ్యాయి. ఈ కూటమిలో పొత్తులో భాగంగా టీడీపీకి 13 స్థానాలు కేటాయించారు. వాటిలో కూకట్ పల్లి కూడా ఒకటి కూకట్ పల్లి నుంచి అనూహ్యంగా హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలోకి దిగారు. అయితే ఇప్పుడు నాని హరికృష్ణ కుటుంబం కోసం తన ఇంటి ఆడపడుచులా సుహాసినిని భావించే కొడాలి నాని ఆమె కోసం కూకట్ పల్లి లో ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని జగన్ కు కూడా చెప్పారట నాని. దీంతో జగన్ షాక్ కు గురయ్యారని సమాచారం. ప్రచారం విషయాన్ని తమ పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే జగన్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదని తెలుస్తోంది. అయినా కొడాలి నాని మాత్రం తాను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి కొడాలి నాని నిజంగా ప్రచారం చేయాలనుకుంటున్నారో లేదో తెలీదు కానీ టీడీపీ శ్రేణులు మాత్రం దీన్ని వ్యతిరేకించే అవకాశాలున్నాయి.
ఎందుకంటే ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రత్యర్థులు. అలాంటిది టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నేత ప్రచారానికి వస్తానంటే టీడీపీ ఒప్పుకుంటుందా? మరోవైపు కొడాలి నాని కూడా ప్రచారానికి రావడం అనుకున్నంత సులువేమీ కాదు. ఒకవేళ అదే గనుక జరిగితే వైసీపీలో అంతర్గత విభేదాలు మొదలయినట్టే. జగన్ కు తన నిర్ణయాన్ని చెప్పిన నానీని వద్దంటే ఊరుకునే రకం కాదు. లేదు వెళ్ళు అంటే టీడీపీ తరుపున ప్రచారం చేస్తే అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇలా ఆలోచించిన జగన్ ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టు తర్వాత మాట్లాడతా అని చెప్పారట. ఇన్ని ప్రతికూలతల నడుమ నాని కూకట్ పల్లిలో టీడీపీ తరుపున ప్రచారం చేస్తారో లేదో చూడాలి.