Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చంద్రబాబు, లోకేష్ ని ఎంత మాట అయినా అనేసే తెగువ వున్న వైసీపీ నాయకుల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు. ఆయన నోటి దూకుడుకి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ హైకమాండ్ రాజకీయంగా నరుక్కొచ్చింది. గుడివాడ క్షేత్ర స్థాయిలో నాని బలాన్ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వచ్చింది. ఈసారి అక్కడ నుంచి లోకేష్ లేదా బ్రాహ్మణి బరిలోకి దిగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గుడివాడ మునిసిపల్ రాజకీయాల్లో నానిని దెబ్బ కొట్టేందుకు ఆయన ముఖ్య అనుచరులు అనుకున్నవారిని కూడా టీడీపీ ఆకర్షించగలిగింది. ఈ వ్యవహారంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. దాన్ని అడ్డుకోడానికి నాని శక్తి సరిపోలేదు. ఈ పరిణామాలతో పాటు లోకేష్ లేదా బ్రాహ్మణి తో తలపడడం అన్న ఆలోచన తో నానికి ఓటమి భయం పట్టుకుందట.
ఒక్కసారి లోకేష్ లేదా బ్రాహ్మణి తో ఎన్నికల బరిలో ఢీకొట్టి ఓడిపోతే తన మాటకి విలువ తగ్గిపోతుందని భయపడుతున్న నాని ఓ ప్రత్యామ్న్యాయ ప్రణాళిక రెడీ చేసి పెట్టుకున్నారట. గుడివాడ రాజకీయాల్ని తన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు చేతిలో పెట్టి తాను బందర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేద్దామని నాని భావిస్తున్నాడట. ఇదే ఆలోచనని వైసీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు జగన్ చూద్దామని అనడం తప్ప కచ్చితమైన హామీ ఇవ్వలేదట. ఒకవేళ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం కొడాలి ముందుగానే చేతులు ఎత్తేసి బందర్ బాట పట్టడం ఖాయం అనిపిస్తోంది. ఈ విషయం చూఛాయగా కనిపెట్టిన టీడీపీ బందర్ కోసం స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తోందట. ఏదేమైనా నాని ముందుగానే చేతులు ఎత్తినా టీడీపీ మాత్రం నిను వీడని నీడని నేను అంటూ ఆయన వెంట పడుతోంది.
మరిన్ని వార్తలు