అటూ ఇటూ కాకుండా పోయిన కోమటి రెడ్డి

komatireddy rajagopal reddy silence

గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పదంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అకస్మాత్తుగా సైలెంట్ అయిపోయారు. వారం పది రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వార్తల్లో వినిపించడం లేదు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని తిడుతూనో, బీజేపీని పొగుడుతూనో, కాంగ్రెసును దూషిస్తూనో వార్తల్లో ఉండే ఆయన ఈమధ్యన సైలెంటయ్యారు. దానికి కానం ఆయన పరిస్థితి ఇప్పుడు ‘రెంటికి చెడ్డ రేవడి’ లా తయారైందట. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీనే విమర్శించారు కోమటిరెడ్డి. తాను బీజేపీలో చేరబోతున్నట్టు, ఆ పార్టీలోనే భవిష్యత్ ఉంటుందని చెప్పి సంచలన ప్రకటనలు గుప్పించారు. బీజేపీలో తానే సీఎం అభ్యర్థి అంటూ ఆయన చేసి రచ్చ ఇప్పుడు ఆయనను బీజేపీలోకి చేరకుండా అడ్డుకుంటోందన్న చర్చ పెద్ద యెత్తున సాగుతోంది. తాజాగా. బీజేపీలో చేరాలని ఆశపడ్డ కోమటిరెడ్డి ప్రయత్నాలకు ఆ పార్టీ అధిష్టానం బ్రేక్ వేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కలిసి కోమటిరెడ్డి తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. వీరిద్దరూ వ్యతిరేకించడంతోనే కోమటిరెడ్డి చేరికను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టిందన్న చర్చ సాగుతోంది.