Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం తర్వాత రైతు చిత్రాన్ని చేయాలని భావించాడు. కాని కొన్ని కారణాల వల్ల ‘నక్షత్రం’ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఏమైందో ఏమో కాని, సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు విడుదలకు సిద్దం అయ్యింది. ‘నక్షత్రం’ సెట్స్‌లో ఉండగానే బాలయ్యతో కృష్ణ వంశీ ‘రైతు’ చిత్రం గురించి మాట్లాడటం జరిగింది. బాలయ్య 101వ చిత్రంగా ‘రైతు’ తెరకెక్కే అవకాశాలున్నాయని అంతా భావించారు. కాని ‘రైతు’ సినిమాలో నటించేందుకు అమితాబచ్చన్ ప్రస్తుతానికి నో చెప్పడంతో టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘నక్షత్రం’ చిత్రం విడుదలైన తర్వాత మరోసారి కృష్ణవంశీ ‘రైతు’ ప్రాజెక్ట్‌ను నెత్తికి ఎత్తుకునేందుకు సిద్దం అవుతున్నాడు. దాదాపు సంవత్సరం క్రితం అమితాబచ్చన్‌ను బాలయ్య మరియు కృష్ణవంశీ కలవడం జరిగింది. అప్పుడు డేట్లు ఖాళీ లేవు అంటూ చెప్పిన అమితాబ్ ఇప్పుడు ‘రైతు’కు డేట్స్ ఇస్తాడనే నమ్మకంతో కృష్ణవంశీ ఉన్నాడు. తన గురువు అయిన వర్మ ద్వారా అమితాబచ్చన్‌ను కలవాలని ఈసారి కృష్ణవంశీ భావిస్తున్నాడు. మరో వైపు ‘పైసా వసూల్’ను పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తున్న బాలయ్య ఆ వెంటనే తమిళ దర్శకుడు రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా అయితే కృష్ణవంశీ ‘రైతు’ చిత్రం వచ్చే సంవత్సరం జనవరిలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చాలా సంవత్సరాలుగా కృష్ణవంశీ పట్టుబడుతున్న రైతు సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల వారు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు:
రానా కెరీర్లో నిలిచిపోయే చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’