Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా పోర్న్‌స్టార్‌తో ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ షార్ట్ ఫిల్మ్‌కు సంబందించిన ట్రైలర్‌ను వర్మ విడుదల చేసి సంచలనం సృష్టించాడు. వర్మ షార్ట్ ఫిల్మ్‌ను రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా ఆ చిత్రంపై మహిళ సంఘాల వారితో పాటు పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నీచమైన సినిమాలను తీస్తూ ఇండియన్స్ పరువును వర్మ తీస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ ఎప్పుడు కూడా వివాదాల కోసం ఏదో ఒక సంచలన సినిమా చేస్తూనే ఉన్నాడు. ఇండస్ట్రీలో కొందరు వర్మకు మద్దతు తెలిపితే ఎక్కువ శాతం వ్యతిరేకిస్తూ ఉంటారు. తాజాగా జీఎస్టీపై రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దనాన్నస్పందించాడు.
కృష్ణంరాజు మాట్లాడుతూ.. సినిమాను వర్మ ఏ ఉద్దేశ్యంతో తెరకెక్కించాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తన సినిమాను వర్మ చూడమని ఎప్పుడు కోరలేదు, పబ్లిసిటీ కూడా చేయలేదు. ఆ చిత్రం గురించి మాట్లాడుతూ మనమే ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నాం అని కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. ఇంటర్నెట్ అధికం అయిన తర్వాత ఈరోజుల్లో పిల్లలకు తెలియని విషయాలు ఏమీ లేవు. వర్మ వల్లే వారికి ఆ విషయం తెలుస్తుంది అంటే తాను ఒప్పుకోను అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చాడు. తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్తున్న వర్మను కదిలించడం వల్ల ఇంకా అతి చేస్తాడని, అందుకే వర్మ చేసే విషయాన్ని ఇష్టం ఉంటే చర్చించాలి లేదంటే వదిలేయాలి అంటూ కృష్ణంరాజు పేర్కొన్నాడు. వర్మను జాతీయ స్థాయిలో మంచి దర్శకుడిగా చూడాలనేది తన కోరిక అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చాడు.