తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రవ్యాప్తంగా 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ముందు చూపు లేకుండా ఏడాది కాలంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఎండబెట్టడం వల్లే అన్నదాతలు తీవ్ర సాగునీటి సంక్షోభం ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లను ఏడాది కాలంగా ఎండబెట్టడం వల్లే తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పదేళ్లపాటు సాగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించాయి అన్నారు.
x.com/KTRBRS/status/1893123580923433177