రాజకీయం కానప్పుడు ఆ ప్రస్తావన దేనికో …?

KTR Controversial Comments On Chandrababu

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు కేటీఆర్ ట్విట్టర్లో ఖండించిన విషయం తెలిసిందే. దీని మీద ప్పుడు చందరబాబు మండి పడ్డారు. జగన్, పవన్, కేసీఆర్ లు అంతా కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అయితే తాజాగా ఆ విషయం మీద కేటీఆర్ స్పందించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు తాను సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, దాడి ఫొటోలను తన పీఏ తీసుకొచ్చి చూపారని అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కోలుకోవాలనీ, ఇలాంటి దాడులను ఖండిస్తున్నానని తాను పోస్ట్ పెట్టినట్లు కేటీఆర్ అన్నారు. మనిషన్న వాడు ఎవడైనా ఇలాంటి దాడుల సమయంలో సానుభూతి తెలుపుతారన్నారు. జగన్ తనకు తెలిసిన వ్యక్తనీ, మిత్రుడనీ, అందువల్లే తాను ట్విట్టర్ లో స్పందించానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

telangana-minister-ktr-gets-relief-from-railway-case

అయితే ఈ ట్వీట్ ను కూడా చంద్రబాబు రాజకీయంగా రాద్ధాంతం చేశారని కేటీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్, కేటీఆర్, పవన్ కల్యాణ్, మోదీ కలిసి నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు’ అంటూ చంద్రబాబు ఆరోపించారని గుర్తుచేశారు. తాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3.38 గంటలకు ట్వీట్ చేస్తే చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ మధ్యాహ్నం 2.30 గంటలకే జగన్ పై దాడిని ఖండించారని తెలిపారు. దీనర్థం చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్ కూడా మాతో కలిసిపోయారా? అని ప్రశ్నించారు. అంతేకాక ప్ర‌సంగంలో భాగంగా స్వ‌ర్గీయ నంద‌మూరి హ‌రికృష్ణ గురించి మ‌రోసారి మాట్లాడారు కేటీఆర్‌. న‌ల్గొండ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగితే, వెంట‌నే మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి స్పందించారని అక్క‌డి నుంచి చంద్ర‌బాబు నాయుడుతో స‌హా ఆయ‌న హైద‌రాబాద్ కి వెంటే ఉంటూ వ‌చ్చార‌నీ, ఆ త‌రువాత కేసీఆర్‌, తాను ఇత‌ర నేత‌లు వెళ్లి ప‌రామ‌ర్శించామ‌న్నారు. ఇలాంటి సంద‌ర్భాల్లో ఎప్పుడూ తాము రాజ‌కీయాలు చేయాల‌ని ఆలోచించ‌లేద‌న్నారు. ఆ కుటుంబానికి అండ‌గా నిల‌వ‌డానికి వెళ్లామేగానీ రాజ‌కీయాల‌కు చేయాల‌ని కాదు. కానీ, ఇవాళ్ల ప్ర‌తీ చిన్న విష‌యాన్నీ చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం చేస్తున్నార‌ని ఆరోపించారు. అయితే ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి ఇది రాజ‌కీయం కాక‌పోతే హ‌రికృష్ణ మ‌ర‌ణానంత‌రం తెరాస స‌ర్కారు ఎంత వేగంగా చురుగ్గా మాన‌వ‌తాదృక్ప‌థంతో స్పందించింది అనేది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాలి. అంటే ఇక్కడ సీమాంధ్రుల మనస్సులో బ‌ల‌మైన ముద్ర వేసుకున్న కొన్ని ఘ‌ట‌న‌ల్ని గుర్తుచేసి ఆయా సందర్భాల్లో వారి పాత్రను గొప్పగా చెప్పుకుంటూ ఏమి పొందాలి అనుకుంటున్నారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.

Jagan Becomes CM If He Wins Nandyala