Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందు, శ్రీముఖి జంటగా కెఎస్ వాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కుటుంబ కథా చిత్రమ్’. ఈ చిత్రంతో శ్రీముఖి మరియు నందులు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యారు. వీరిద్దరు కూడా హీరో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునేందుకు తెగ ఆపసోపాలు పడుతున్నారు. ఇక ఈ చిత్రం టైటిల్ చూస్తే ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం అని అంతా భావించారు. కాని తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తుంటే ఇదో పక్కా హర్రర్ థ్ల్రిర్ చిత్రం అని తేలిపోయింది. నందు మరియు శ్రీముఖిలతో పాటు కమల్ కామరాజు కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించాడు.
టీజర్ ఊహకు అందని విధంగా చాలా విభిన్నంగా ఉంది. నందు మరియు శ్రీముఖిల జంట చాలా బాగుందని, తప్పకుండా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక కమల్ కామరాజు చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టీజర్లో చూస్తుంటే కమల్ కామరాజు పాత్ర విలన్‌గా కనిపించబోతున్నట్లుగా అనిపిస్తుంది. శ్రీముఖ బుల్లి తెరపై సూపర్ హిట్ అయ్యింది. కాని వెండి తెరపై మాత్రం సక్సెస్ కోసం చకోర పక్షితరహాలో ఎదురు చూస్తుంది. మరి ఈమెకు ఈ చిత్రం అయినా హీరోయిన్గా సక్సెస్‌ను తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.