కేవీపీ కి జగన్ మీద ప్రేమ వెల్లడించిన తాజా ప్రెస్ మీట్.

KVP Ramachandra Rao fires on Chandrababu in press meet

ఆంధ్రప్రదేశ్ లో తిరిగి కాంగ్రెస్ పుంజుకోవాలంటే వైసీపీ ని టార్గెట్ చేయాల్సిందే అని ఇటీవలే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. పార్టీలోకి కిరణ్ ని ఆహ్వానించే సందర్భంతో పాటు వరసగా ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాహుల్ ఇంతగా చెబుతున్నా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చెవికి ఎక్కినట్టు లేదు. వై.ఎస్ చనిపోయినప్పుడు కేవీపీ భవిష్యత్ ఏంటా అని అంతా అనుకున్నారు. ఆయన వైసీపీ లో చేరకపోవడంతో అబ్బో కాంగ్రెస్ అంటే అంత ప్రేమ ఉందనుకున్నారు. కానీ అందులో నిజం లేదని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. చంద్రబాబుని ఇబ్బంది పెట్టి జగన్ కి లబ్ది చేకూర్చడానికి కేవీపీ తో పాటు ఆయన శిష్యగణం ఉండవల్లి లాంటి వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ ఆదేశాల తర్వాత అయినా ఆ పరిస్థితిలో మార్పు లేదని ఈరోజు మరోసారి నిరూపించారు కేవీపీ.

కొద్దిసేపటికిందట ప్రెస్ మీట్ లో ఏపీ కి ప్రత్యేక హోదా అంశం మీద మాట్లాడారు. హోదా ఇవ్వని బీజేపీ ని తూర్పారబట్టారు. హోదా కోసం పోరాడి nda నుంచి బయటకు వచ్చిన టీడీపీ ని కూడా తెగ తిట్టారు. చంద్రబాబు గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇన్ని చేసిన కేవీపీ కి పాపం… అల్లుడు అని పిలుచుకునే జగన్ గురించి మాత్రం గుర్తే లేకుండా పోయింది. ఇంతకుముందు అయితే ఓకే గానీ రాహుల్ గాంధీ ఇంత స్పష్టంగా వైసీపీ ని టార్గెట్ చేయమని చెప్పాక కూడా జగన్ పేరు ఎత్తకుండా ఆయన మీద ప్రేమ చాటుకున్నారు కేవీపీ.