లగడపాటి కాషాయం కప్పుకుంటారా..?

Lagadapati Interesting To Join The Bjp Party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Lagadapati Interesting To Join The Bjp Party

లగడపాటి మొన్నీమధ్య ఏపీ సీఎం చంద్రబాబును కలిస్తే.. అందరూ ఆయన టీడీపీలోకి వస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త రకమైన న్యూస్ బయటికి వచ్చింది. లగడపాటి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారట. అయితే అందుకు బాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన్ను కలిశారన్న మాట ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంటే ప్రతిపక్షాల మాటలకు భిన్నంగా అమిత్ షా.. అన్ని విషయాల్లో బాబు మాటకు విలువిస్తున్నారనే అర్థం చేసుకోవాలి.

 
కేంద్రమంత్రివర్గంలో కీలక నేతలతో ఎప్పుడూ టచ్ లో ఉండే లగడపాటికి బీజేపీలో చేరడం పెద్ద కష్టం కాదు. కానీ అందుకు టీడీపీ అధినేత ఆశీస్సులతో పాటు సహకారం ఉంటే. భవిష్యత్తుకు ఢోకా ఉండదని కమలనాథులు సెలవిచ్చారట. అందుకే హఠాత్తుగా సెక్రటేరియట్ కు వెళ్లిన లగడపాటి. బాబును కలిసి తన మనసులో మాట చెప్పారట. మరి బాబేం చెప్పారనేది మాత్రం బయటకు రాలేదు.

అందుకే ప్రస్తుతానికి ఏమీ చెప్పకుండా కేశినేనిని సెట్ రైట్ చేశాక చూద్దామనుకుంటున్నారేమో అనే వాదన వినిపిస్తోంది. లగడపాటి అడిగినట్లు బీజేపీలోకి పంపాలా.లేదంటే కేశినేనికి చెక్ పెట్టి టీడీపీలోకి తీసుకోవాలా అనే విషయంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారట. రాబోయే రెండేళ్లలో కేశినేని వ్యవహారశైలిని బట్టి బాబు నిర్ణయం ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి. అందుకే నాని ఈ మధ్య కాస్త తగ్గి ఉంటున్నారట.

మరిన్ని వార్తలు

అయ్యో జీవిత ని తప్పుగా అనుకున్నారు.

అబ్బో … సిబిఐ హనుమంతుడి లెక్కన్న జగన్.