Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ మధ్య చాలా విశాల హృదయంతో ఆలోచిస్తున్నారు. బీజేపీని బద్ధశత్రువుగా చూస్తున్న లాలూ.. అందుకోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతున్నారు. చివరకు మాయావతిని ఆర్జేడీ తరపున రాజ్యసభకు పంపుతామని ఆఫర్ ఇచ్చారు. అయితే లాలూ ఆఫర్ పై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. మాయావతి చేజేతులా పదవి అందుకుంటే.. తాము ఎందుకు ఆదుకోవాలో వారికి అర్థం కావడం లేదు.
కానీ లాలూ పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారంటున్నారు పరిశీలకులు. 2019లో మోడీని ఢీకొట్టడానికి బలమైన కూటమి కావాలని, అందుకు ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే అసలు విషయం అది కాదని, సీబీఐ తనతో మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది కాబట్టి.. సపోర్ట్ గా దళిత నేతను ఎతుక్కుంటున్నారనేది విమర్శకుల వాదన.
ఏది ఏమైనా కేంద్రాన్ని ఎదిరించే శక్తి మాయావతికి లేదన్నది సుస్పష్టం. ఎందుకంటే లాలూ మాదిరిగా ఆమె పైనా కేసులున్నాయి. వాటిని కదిలిస్తే మాయావతి కూడా జైలు కెళ్తారు. పైగా బతికుండగానే తన విగ్రహాలతో పార్కే పెట్టించుకున్న ఘనత ఇండియాలో.. మాయావతిదే. అలాంటి మాయావతిని నమ్ముకుంటే.. లాలూ కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే అవుతుంది.
మరిన్నివార్తలు